జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసిన అందెల కుమార్ యాదవ్
శేరిలింగంపల్లి అక్షిత ప్రతినిధి : శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించినజై బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర యూత్ అధ్యక్షులు అందెల కుమార్ యాదవ్ బ్రదర్స్ జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ని అందెల కుమార్ యాదవ్ బ్రదర్స్ యూత్ అసోసియేషన్ కార్యవర్గ ముఅందెల కిరణ్ యాదవ్, విజయ్ రాజు, కే విజయ్ యాదవ్, సభ్యులతో కలిసి మర్యాదపూర్వకంగా జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ని సన్మానించడం, నూతనంగా ట్రాన్స్ఫర్ అయి డ్యూటీ జాయినయిన సందర్భంగా
జోనల్ కమిషనర్ ని కలిసి శేరిలింగంపల్లి సమస్యలను సంక్షేమ విషయాల గురించి చర్చించడం కూడా జరిగింది శేరిలింగంపల్లి హైటెక్ సిటీ అయినను కొన్ని పేద బస్తీలు మరియు లంబాడి తండాలు పేదలు నివసించే మురికివాడలు కూడా ఉన్న ప్రదేశం హైటెక్ సిటీ, , మాదాపూర్ కొండాపూర్ దుర్గం చెరువు లాంటి ధనిక ప్రాంతాలు కూడా ఉన్న ను పేదల బస్తీలు కూడా ఉన్నాయి. ఇక్కడ యూత్ గురించి పీజేఆర్ స్టేడియం ఉందని సరి అయిన సదుపాయాలు కల్పించి క్రీడలు యోగా మరియు స్పోర్ట్స్ వాలీబాల్ బ్యాట్మెంటన్ ఫుట్బాల్ లాంటి గేమ్స్ యూత్ కొరకు ప్రోత్సహించాలని శ్రీ ఉపేందర్ రెడ్డి జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. లైబ్రరీ ఫెసిలిటీ లేక యువత కొంతమంది అసౌకర్యానికి గురి అవుతున్న మాట నిజం అందుకని తారా నగర్ లైబ్రరీ పునరుద్ధరించాలని పాత మున్సిపల్ ఆఫీస్ గ్రామపంచాయతీ ఆఫీస్ లో ఉన్న లైబ్రరీని అభివృద్ధి పరచాలని శేరిలింగంపల్లి అన్ని బస్తీలలో లైబ్రరీ ఫెసిలిటీ కల్పించాలని, యువతకు కోచింగ్ గురించి కొన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం ద్వారా కల్పించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై బి.సి ఐక్యవేదిక రాష్ట్ర యువత అధ్యక్షులు అందెల కుమార్ యాదవ్ తో పాటు బ్రదర్స్ అసోసియేషన్ కార్యవర్గం సంఘ సభ్యులు ఏ.కిరణ్ యాదవ్ విజయ్ రాజు కె విజయ్ యూత్ సభ్యులు పాల్గొని మర్యాదపూర్వకంగా సన్మానించి గౌరవించడం జరిగింది.