ఖాళీ సీసాలు ఎత్తేసి.. మందు బాబుల అడ్డాకు చెక్

అక్షిత ఎఫెక్ట్

ఖాళీ సీసాలు ఎత్తేసి..
మందు బాబుల అడ్డాకు చెక్

స్పందించిన శానిటేషన్ విభాగం అధికారులు..

మందుబాబులకు అడ్డాగా
పట్టణ ప్రకృతి వనం..

పరిసరాలు శుభ్రంగా ఉండాలి

కనిపించని స్వచ్ఛ సర్వేక్షన్ పేరుకేనా..?

విచ్చలవిడిగా కొనసాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు
పట్టణ ప్రకృతి వనం అడ్డ..

అనే కథనాన్ని అక్షిత జాతీయ దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందించిన శానిటేషన్ విభాగం సిబ్బంది అధికారులు..

మేడ్చల్, అక్షిత బ్యూరో :
మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వదిలారు. మందు బాబులకు స్థావరంగా మారిన పట్టణ ప్రకృతి వనంలో తాగి పడేసిన ఖాలీ సీసాలను తొలగించారు. ప్రకృతి రమణీయ అందాలను పట్టణ ప్రజలు ఆస్వాదించాల్సి ఉండగా మందు బాబులకు అడ్డాగా మారుతోంది. అసాంఘిక కార్యకలాపాలకు స్థావరంగా నిలిచింది. ఆయా అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు కదిలి మున్సిపల్ అధికారులు కదిలారు.

మందుబాబులకు అడ్డాగా పట్టణ ప్రకృతి వనం అనే శీర్షికతో అక్షిత తెలుగు జాతీయ దిన పత్రిక ప్రచురించింది.పట్టణ ప్రగతి వనాలకు హరితహారంకు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపు ప్రభుత్వాలు కానీ దుండిగల్ పురపాలకలో మాత్రం కనిపించని స్వచ్ఛ సర్వేక్షన్ శానిటేషన్ విభాగం పారిశుద్ధం పడకేసినట్లు ఉంది ఎక్కడ వేసిన గొంగడి అక్కడేసినట్లే అస్తవ్యస్తంగా తయారైంది దుండిగల్ పురపాలక సానిటేషన్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యమా? అధికారుల వైఫల్యమా? విమర్శలు బలంగా వినిపిస్తున్నాయనే అక్షిత జాతీయ దినపత్రిక వార్తతో పట్టణ ప్రకృతి వనంలో శానిటేషన్ విభాగం అధికారులు అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి మందు సీసాలను వెంటనే తొలగించి దుండిగల్ స్థానిక పోలీస్ స్టేషన్ లో దుండిగల్ పురపాలకలో ఉన్నటు వంటి పట్టణ ప్రకృతి వనంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మందుబాబులు అడ్డాలకు చెక్ పెట్టేందుకు ఫిర్యాదు పత్రం అందజేసినట్టు మున్సిపల్ అధికారులు తెలిపారు.

అక్షిత జాతీయ దినపత్రిక వార్తకు స్పందించి నందుకు శానిటేషన్ విభాగం అక్షిత జాతీయ దినపత్రిక యాజమాన్యానికి సాయిపూజ కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking