*కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ ఆమెరికా ఆధ్వర్యంలో దుబ్బాక ప్రసాద్ కు 10000 ఆర్థిక సహాయం*
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన దుబ్బాక ప్రసాద్ గత నెల రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉన్నారు, వారికి 5సంవత్సరాల బాబు ఉన్నారు. వారి కుటుంబం ఆదారం కోల్పోయిన విషయాన్ని సంబంధించిన వివరాలు స్థానిక కానా వాలంటీర్ అంతటి స్వామి గారి ద్వారా తెలుసుకున్న కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ట్రస్టు సభ్యులు, వేంటనే వారి కుటుంబానికి మంజూరుచేసిన రూ.10 వేల ఆర్థికసాయాన్ని కానా స్థానిక వాలంటీర్లు నాతి పాండు ,నాతి రామక్రిష్ణ, అంతటి స్వామి చేతులమీదుగా దుబ్బాక ప్రసాద్ ను పరామర్శించి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కునురు సాయికుమార్ గౌడ్ డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్,కల్లు గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భావండ్లపల్లి బాలరాజు, గీత సంగం అధ్యక్షులు అంతటి మల్లేశం కునూరు మల్లేశం తదితరులు పాల్గొన్నారు