కాసులకు కక్కుర్తిపడి… కబ్జాదారులకు అండగా?

కాసులకు కక్కుర్తిపడి
కబ్జాదారులకు అండగా?

తూతూ మంత్రంగా కూల్చివేతలు !!

కబ్జాదారులు చెక్ పెట్టేదేన్నెడు

మేడ్చల్, అక్షిత బ్యూరో:

కాసులకు కక్కుర్తిపడి అక్రమార్కులకు అండగా నిలుస్తుండ్రు. కబ్జాదారులకు అండగా అధికారులు నిలుస్తూ తూతూ మంత్రంగా కూల్చివేతలు చేస్తుండ్రు. ఆరోపణలు వచ్చినప్పుడు తప్ప కూల్చివేతలు చేపట్టరు. దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధి దుండిగ ల్ తాండా టూ లో సర్వే నంబర్ 684 ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెవిన్యూ అధికారులు పైపై కూల్చివేతలు చేపట్టి మమ అనిపంచారు.

రెవిన్యూ అధికారులకు ముడుపులు ముట్టడంతోనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదంటూ విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణదారులకు సహకరించేందుకు రెవిన్యూ ఇన్స్పెక్టర్, విఆర్ఏలు మొదలు భారీగా ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దుండిగల్ తాండాటూలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను తొలగించడంలో అధికారులు వెనకడుగు వేస్తున్నారంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఆర్డీవో ఆదేశాలు బేఖాతర్

దుండిగల్ తాండాటూ లో సర్వే నంబర్ 684లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో ఆర్డీఓ శ్యాం ప్రకాష్, తహసిల్దార్ అబ్దుల్ సయ్యద్ మతీన్ కు అక్రమనిర్మాణాలను కూల్చివేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేసినా రెవిన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలకు వెనకడుగు వేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తుందని వినికిడి. ముడుపులు అండడంతోనే అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లడంలేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

స్థానిక ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో కొందరు వ్యక్తులు దుండిగల్ తాండా-రెండు రెండు కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని అమాయకులకు కట్టబెడుతూ సొమ్ము చేసుకుంటున్న పట్టించుకోవడంలేదు. పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నా త్వరలో చర్యలు తీసుకుంటామంటూ గత వారం రోజుల నుండి కాలయాపన చేస్తున్నారు తప్ప చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. దుండిగల్ తాండాలో జరుగుతున్న అక్రమనిర్మాణాల గురించి ఫోటోలు తీస్తున్న విలేకరులపై దాడులకు యత్నిస్తుండడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలంలో సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ స్థలం కాపాడాలని తాండా స్థానికులు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking