రామన్నపేటకు మంజూరైన సబ్ కోర్టును వెంటనే ప్రారంభించాలి*

*రామన్నపేటకు మంజూరైన సబ్ కోర్టును వెంటనే ప్రారంభించాలి*

*చౌటుప్పల్ కు తరలించాలనే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి*

*సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి*

నకిరేకల్ అక్షిత ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రంలో హైకోర్టు జీవో 50 ప్రకారం మంజూరైన సీనియర్ సివిల్ కోర్టు (సబ్ కోర్టు)ను రామన్నపేటలో వెంటనే ప్రారంభించాలని మంజూరైన కోర్టులు వేరే ప్రాంతానికి తరలించాలనే ఆలోచన సరైంది కాదని సిపియం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి అన్నారు. స్థానిక సిపియం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామన్నపేట గతంలో తాలుకగా,నియోజకవర్గంగా చుట్టూర 6 మండలాలకు కేంద్రంగా ఉన్నది.నియోజకవర్గ స్థాయి కార్యాలయాలన్ని ఉండి ప్రజలకు సేవలందిస్తున్నవి. 1982 నుండి సుమారుగా 42 సంవత్సరాలుగా అనేక మంది ప్రజలకు జూనియర్ సివిల్ కోర్టు ఉండి సేవలందిస్తుంది.అదనపు కేసులు పెరగడంతో ప్రజల అవసరాన్ని గుర్తించి ప్రభుత్వం,అధికారులు గుర్తించి జివో 50 ప్రకారం రామన్నపేటకు సీనియర్ సివిల్ కోర్టు (సబ్ కోర్టు) ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. 5 కోట్ల రూపాయలు మంజూరి చేసింది.రెవిన్యూ శాఖ వారు ఐదు ఎకరాల భుమి సేకరణ కూడా చేశారు.మంజూరైన సబ్ కోర్టును చౌటుప్పల్ కు మార్చాలని ముఖ్యమంత్రికి కొంత మంది నాయకులు వినతి పత్రం ఇవ్వడం సరైనది కాదు.ఇప్పటికే మంజూరైన దానిని ఎలా తరలిస్తారని అన్నారు.ఇప్పటికే ముఖ్యమైన కార్యాలయాలు తరలిపోతున్నాయి.స్థానిక యంపి,ఎం.ఎల్.ఎ చొరవ చూపి ప్రారంభించాలన్నారు.మంజూరైన కోర్టును చౌటుప్పల్ కి తరలిస్తే మండలంలో మేదావులు,విద్యావంతులు,మండలంలో అఖిల పక్ష పార్టీలను ప్రజలను సమీకరించి ఆందోళనను ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపియం జిల్లా కమిటి సభ్యులు జల్లల పెంటయ్య,మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం,మండల కార్యదర్శివర్గ సభ్యులు బోయిని ఆనంద్,కూరేళ్ళ నర్సింహ్మచారి,గాదె నరేందర్,బల్గూరి అంజయ్య,మీర్ ఖాజాఅళి,మండల కమిటి సభ్యులు కందుల హనుమంతు,బావండ్లపల్లిబాలరాజు,కల్లూరి నగేష్,గన్నెబోయిన విజయభాస్కర్ ,వేముల సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking