అక్రమ కట్టడం తక్షణమే నిలిపివేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
ఖమ్మం /అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరం మామిడి మామిళ్ళగూడెం రవి స్వీట్స్ పక్కన ఉన్న ఇంటి నెం. 10-2-5 లో 200 గజాలు కోర్టులో గెలిచిన స్థలం 1999లో ఓయస్.నెం. 225/1999 గెలిచియున్నాము. మరల దీని మీద అప్పీల్ కు (ఏ యస్. నెం. 76/07 జన్ను మహంతి వెంకటేశ్వరమ్మ అలియాస్ ఎజ్జల వెంకటేశ్వరమ్మ వెట్టిన కూడా మరల మేమే గెలిచాము. మరల వెంకటేశ్వరమ్మ చల్ల మణి అనే నాపై కోర్టులో కేసు (ఓ.యస్ నెం. 557/2015 ) కేసు వేయగా చల్ల మణి అనే నేను 07.01. 2022 కోర్టు కేసులో గెలిచాను. దీనికి గల కారణం తెల్ల కాగితం సృష్టించి దానిలో పసుమర్తి శ్రీనివాసరావు అక్రమ కట్టుబడి కడుతున్నారు. తక్షణమే కట్టుబడిని నిలిపివేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చల్ల మణి డిమాండ్ చేశారు.నిన్న ఖమ్మంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నా భార్య అన్న మహంతి సత్య స్వప్న కు వారసత్వంగా సంక్రమించిన స్థలం ఫసిలి నెం. 37/1353 ఎఫ్, ఇంటి నెం. 10-2- 5. విస్తీర్ణం 2620 గజాలలో నుండి 184 గజాల ఇంటి స్థలంను అక్రమంగా దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు.నేను అనగా చల్ల మణి, తండ్రి రోశయ్య(లేటు), నివాసం. ఇం.నెం. 2-57-1, కన్నాయిగూడెం గ్రామం ఎటపాక మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా.నా భార్య జన్నుమహంతి సత్య స్వష్ట కు వారసత్వంగా సంక్రమించిన టువంటి స్థలం ఫసిలి నెం. 37/ 1353 ఎఫ్, ఇం.నెం. 10-2-5, విస్తీర్ణం. 2620 గజాలు, ఇట్టి స్థలం 1) జన్ను మహంతి బంగారు విఠల్ తండ్రి సత్యనారాయణ 2) జన్న మహంతి బ్రహ్మ సుదర్శన్ రావు తండ్రి సత్యనారాయణ 3) జన్ను మహంతి శివరావు తండ్రి సత్యనారాయణ 4) జన్ను మహంతి స్వామిరావు తండ్రి సత్యనారాయణ అనువారు వారసులుగా వున్నారు.నా మామ లేటు జన్నుమహంతి స్వామిరావు మరణించిన తర్వాత ఆయన ఏకైక కుమార్తె జన్ను మహంతి స్వష్టకు వారసత్వంగా ఇట్టి స్థలం సంక్రమించినయున్నది.1999 సం.లో మా మామ మృతి తరువాత నా భార్యపై మహంతి వెంకటేశ్వరమ్మ అలియాస్ ఎఱ్ఱల వెంకటేశ్వరమ్మ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఖమ్మం ఓ.యస్. నెం. 225/1999లో మీ నాన్న నీ పేరు మీద ఉన్న స్థలం నాకు వ్రాసి ఇచ్చినారు అని కేసు వేసినారు. 2005 సం.లో నా భార్యకు అనుకూలంగా తెల్ల పేపర్ పై ఫోర్టరీ చేసిన దొంగ సంతకాలు చేసినందుకు కోర్టు వారు నాకు అనుకూలంగా ఇట్టి స్థలం నా భార్యకు సంక్రమించింది అని తీర్పు ఇచ్చినారు.2007 లో మా ఇద్దరికి వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత కూడా జన్నుమహంతి వెంకటేశ్వరమ్మ అలియాస్ ఎజ్జల వెంకటేశ్వరమ్మ జయంత్ సత్యనారాయణ అనువారు నా భార్య నన్నుచాలా ఇబ్బందులకు గురి చేసినారు ఇట్టి కారణం చేత 2009 లో నా భార్య ఆత్మహత్య చేసుకొని మరణించినది. దీనికి కారణమైన జనుమహంతి వెంకటేశ్వరమ్మ అలియాస్ ఎజ్జల వెంకటేశ్వరమ్మ జయంత్, సూర్యనారాయణ అనువార్లపై నేను పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినారు కానీ నాకు న్యాయం జరుగలేదు.నా భార్యకు వారసత్వంగా సంక్రమించినటువంటి వాటాలో ఇం.నెం. 10-2-5 గల స్థలమును బిటివి రమణారావు కి చల్ల మణి అను నేను 2010 వ సం.లో విక్రయించినాను. ఇట్టి డాక్యు మెంట్ నెం. 3914/2010.
2007 సం.లో జనుమహంతి వెంకటేశ్వరమ్మ అలియాస్ ఎజ్జల వెంకటేశ్వరమ్మ అనువారు నాపై ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఖమ్మం కోర్టులో అప్పీల్ (ఏ.యస్.నెం. 76/7) వేసినారు. ది. 03.03.2009లో ఇట్టి కేసు మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇట్టి కేసుకు సరైన ఆధారాలు లేనందున కేసును డిస్మిస్ చేసినారు. A.S. No. 76/2007 in I.A. No. 763/2011
2012 సం.లో నా భార్యకు వారసత్వంగా సంక్రమించినటువంటి కొంత స్థలం ఇం.నెం. 10-2-5 గల స్థలంను బి. వెంకటలక్ష్మి భర్త బి.వి.టి. రమణారావు గారికి విక్రయించినాను. ఇట్టి డాక్యుమెంట్ నెం. 9706/ 2012.
మరలా నా మీద ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, ఖమ్మం నందు 2015లో జనుమహంతి. వెంకటేశ్వరమ్మ అలియాన్ ఎజ్జల వెంకటేశ్వరమ్మ కేసు ఓ.యన్. నెఇ. 557/2015 వేసినారు. ది.07.0.3.2015న ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు నేను పైన తెలిపిన వారిపై కేసు వేయడం జరిగింది. (కేసు రిసిప్ట్ నెం. 34) ఇట్టి కేసుపై పైన తెలిపిన వారికి ఫోన్ చేసి ఇట్టి స్థలంకు సంబంధించి మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయే తీసుకురమ్మని తెలుపగా వారు 15 రోజుల తర్వా ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని రాకుండా మా డాక్యుమెంట్స్ లేవని మేము తెల్ల కాగితంపై ఫోర్జరీ చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని ఇద్దరు ఎస్సై ల ముందు అంగీకరించినారు. స్టేట్మెంట్ రికార్డు చేశారు. కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇందుకు వారు నాపై కక్ష్య పెట్టుకొని సుమారు రాత్రి 8.30 గం.లకు నాపై ఎజ్జల జయంత్ మరియు నలుగురు వ్యక్తులు నాపై కత్తులతో దాడి చేయడానికి వస్తే తప్పించుకొని నేను పోలీస్ కేసు పెట్టినాను.నాకు ఎటువంటి న్యాయం జరుగలేదు.నాకు తెలియకుండా జన్నుమహంతి వెంకటేశ్వరమ్మ అలియాన్ ఎజ్జల వెంకటేశ్వరమ్మ అనువారు పసుమర్తి శ్రీనివాసరావు పేరును తప్పుడు పత్రాలతో దొంగ రిజిస్ట్రేషన్ చేయించారు. ఇట్టి స్థలంలో పసుమర్తి శ్రీనివాసరావు అను వ్యక్తి అక్రమంగా నిర్మిస్తుండగా భూమి నాది అని తెలిపినా కూడా నన్ను బెదిరించి నాపై దౌర్జన్యం చేసి నన్ను చంతుతామని ఏమి చేసుకుంటావో చేసుకో అని నన్న బెదిరింపులకు గురు చేశారు.ఈ విషయమై ఖమ్మం సిపి కి ఫిర్యాదు చేయగా పసుమర్తి శ్రీనివాసరావు కి ఫోన్ చేసి నీదగ్గర డాక్యుమెంట్స్ ఏమివున్నాయే తీసుకురమ్మని పలుమార్లు కోరగా తను ఏ డాక్యుమెంట్స్ ఇవ్వలేకపోయాడు. ఈ విషయం పై మున్సిపాలిటీ వారు వచ్చి కన్స్ట్రక్షన్ ను ఆపివేసినారు. మరల దొంగతనంగా కన్స్ట్రక్షన్ ను చేస్తున్నారు. ఇలా నేను మున్సిపాలిటీ వారికి ఫోన్ చేయడం మున్సిపాలిటీవారు వచ్చి ఆపడం మరల కన్స్ట్రక్షన్ చేయడం ఇలా 15 సార్లు జరిగింది. ఈ బిల్డింగ్కు ఎటువంటి పర్మిషన్ లేదు ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. అయినా ఇప్పటి వరకు వారు 5 అంతస్థులు కట్టారు. మున్సిపాలిటీ ఆఫీసు నుండి పసుమర్తి శ్రీనివాస్ కి ఇప్పటివరకు 3 నోటీసులు పంపించినా కూడా ఇంతవరకు రెస్పాన్స్ కాలేదు.పసుమర్తి శ్రీనివాసరావు మరియు ఇంకో ముగ్గురు జన్నుమహంతి వెంకటేశ్వరమ్మ అలియాస్ ఎజ్జల వెంకటేశ్వరమ్మ, ఎజ్జల జయంత్ ఎఱ్ఱల సూర్యనారాయణ అనువారు నన్ను చంపుతామని బెదిరించుచున్నారు.వారి నుండి నాకు ప్రాణహాణి ఉన్నదన్నారు.కోర్డు ఆర్డర్ ప్రకారం తక్షణమే అక్రమబిల్డింగ్ ను కూల్చివేసి నాకు తగిన న్యాయం చేయాలని కోరారు.