*వరదలో కొట్టుకొచ్చిన కారులో మృతదేహం లభ్యం*
*సూర్యాపేట, అక్షిత బ్యూరో*
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వైష్ణవి పాఠశాల సమీపంలోని వాగులో ఈరోజు రెండు కార్లు ఆటోలు వరద ఉద్ధృతికి కొట్టుకొచ్చాయి. కారులో ఓ మృతదేహం ఉన్నట్లు అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.

మృతుడు కోదాడవాసి నాగం రవిగా గుర్తించినట్లు తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.