అనాధలకు దుప్పట్లు పంపిణీ

అనాధలకు దుప్పట్లు పంపిణీ
పెరిక గోపాల్ కు ఘన నివాళులు
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
అనాధలకు పెరిక గోపాల్ రాజరత్నం ఛారిటబుల్ ట్రస్ట్ దుప్పట్లు పంపిణీ చేసింది. మంగళ వారం
నల్గొండ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, ప్రకాశం బజార్ వ్యవస్థాపకులు స్వర్గీయ పెరిక గోపాల్ 23 వ వర్దంతిని పురస్కరించుకొని తనయుడు పెరిక గోపాల్ రాజరత్నం ఛారిటబుల్ ట్రస్ట్ జాతీయ అధ్యక్షులు పెరిక కరణ్ జయరాజ్ స్థానిక రామగిరిలోని మథర్ థెరిసా ఛారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న సుమారు 100 మంది అనాధలకు దుప్పట్లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆపన్నులకు ఆసరా నిలిచేందుకు తమ ట్రస్ట్ విశిష్ఠ సేవలందిస్తున్నారు. తమ తండ్రి పెరిక గోపాల్ జిల్లా కాంగ్రెస్ పటిష్ఠతకు అవిరళ కృషి చేశారన్నారు. తమ తండ్రి బాటలోనే అటు పార్టీ అభివృద్ధికి ఇటు ప్రజా సేవలో సేవలందిస్తున్నారు. అనంతరం పెరిక గోపాల్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమoలో స్థానిక కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, ఐఎన్ టియూసి జిల్లా అధ్యక్షులు వడ్డెబోయిన సైదులు, పసల శౌరి, విలియం, దుబ్బ పరమేష్ ,ఎద్దు రమేష్ ,పెరిక రాజు,శ్రవణ్,మహెష్ ,రాంబాబు,మక్బుల్ ,శ్రీకాంత్ ,రవి ,ఛారిటబుల్ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking