6న గ్రేటర్ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ సమావేశం

6న గ్రేటర్ జర్నలిస్టుల    హౌసింగ్ సొసైటీ సమావేశం

సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు
మామిడి సోమయ్య, బొల్లం శ్రీనివాస్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశం సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో నిర్వహించాలని సొసైటీ కార్యవర్గం నిర్ణయించింది. తమ సొసైటీకి ప్రభుత్వం స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయించడం జరుగుతుందని సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు మామిడి సోమయ్య, బొల్లం శ్రీనివాస్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధన కోసం 2008లో ఈ సొసైటీ ఏర్పడిందని, దాదాపు 1400 మంది జర్నలిస్టులు సొసైటీలో సభ్యులుగా ఉన్నారని, చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సొసైటీకి స్థలం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి, మంత్రులకు పలు మార్లు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని చెప్పారు. ఈ నెల 6వ తేదీన జరిగే సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయడం జరుగుతుందని తెలిపారు. కీలకమైన ఈ సమావేశానికి సొసైటీ సభ్యులందరు తప్పని సరిగా హాజరు కావాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking