అంతా అవాస్తవం
అసత్య ఆరోపణలు
పార్టీ మారాను
అదే రాజకీయ కక్ష
చైర్మన్ నరేందర్ రాజు
మేడ్చల్, అక్షిత బ్యూరో :
అంతా అవాస్తవం… అసత్య ఆరోపణలు… పార్టీ మారాను… అందుకే రాజకీయ కక్షతో నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో మారడంతో కొందరు సొసైటీ సభ్యులు గత అక్టోబర్ లో అవిస్వాస తీర్మానానికి తెరలేపారని, కుదరకపోవడంతో వారి అనుచరుల ద్వారా డిసిఓకు ఫిర్యాదు చేశారని దూలపల్లి సహకార సంఘం చైర్మన్ గరిసే నరేందర్ రాజు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిధుల అవకతవకలు విషయంలో ఆగస్టులో ఎంక్వైరీ వేసింది వాస్తవమే అన్నారు. త్వరలో వివరణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
అకౌంట్ నంబర్ 118 ద్వారా ఆయా ఖాతాల నుండి తీసుకున్న లోన్ మొత్తం చెల్లించానన్నాడు. రాజకీయ కక్ష సాధింపుతోనే నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.2019 లో బాధ్యతలు తీసుకున్న తరువాత 56 కోట్లు రుణాలు ఇచ్చామని అందులో ఇప్పటికే 54 కోట్ల రుణాలు వసూలు చేశామన్నారు.