మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడం

మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడం

-ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి టి శ్రీనివాస్

ఖమ్మం /అక్షిత బ్యూరో :

కేంద్రంలో మోడీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను దేశ కార్మిక వర్గం ప్రతిఘటించాలని ఐఎఫ్టి యు జాతీయ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాస్ కార్మిక వార్గానికి పిలుపు నిచ్చారు.గురువారం నాడు రెండు ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ ల ఆధ్వర్యంలో జిల్లా కమిటీలు సెప్టెంబర్ 30 న ఛలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నా ను జయప్రదం చేయడంలో భాగంగా నిర్వహించిన ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల సదస్సు లో పాల్గొన్న టి.శ్రీనివాస్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల మోడీ పాలన పూర్తిగా అప్రజాస్వామికంగా ప్రజా వ్యతిరేక కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగానే కొనసాగిందని ఆ దుర్మార్గమైన పాలన కొనసాగింపుగానే మూడవసారి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను వంద రోజులలో అమలు చేస్తామని చెప్పడం జరిగిందని,వలసవాద చట్టాలను సవరిస్తామని వాటికంటే ప్రమాదకరమైన మూడు నేర చట్టాలను ముందుకు తెచ్చి పోలీస్ వ్యవస్థకు సర్వాఫికారాలను ఇచ్చి ప్రజా ఉద్యమాలను అణిచివేయడం పౌర ప్రజాస్వామిక స్వేచ్చను హక్కులను సర్వం హరించివేసే విధంగా క్రిమినల్ చట్టాలను జూలై 1 నుండి అమలు చేస్తుందని వీటికి వ్యతిరేకంగా ప్రజలు కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమించాలని కోరారు.
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం శాశ్వత ఉద్యోగులను స్థానంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ను నియమిస్తూ కార్మికుల శ్రమను దోచుకోవడానికి పునుకుంటుందని అన్నారు. రెండు ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎం.శ్రీనివాస్ ఆర్ జనార్ధన్ లు మాట్లాడుతూ దేశంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న సుమారు 44 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు నేటికీ చట్టబద్ధ హక్కులుఈ ఎస్ ఐ పీ ఎఫ్ కనీస వేతనాలు గుర్తింపు కార్డులు పెన్షన్ సౌకర్యాలు లేవని అన్నారు.సంఘటిత రంగ కార్మికుల శ్రమ ద్వారా కోట్లాది రూపాయల సంపద దేశంలో పోగుబడుతున్నప్పటికి అసంఘటిత రంగ కార్మికుల జీవితాలను మాత్రం కణాకష్టంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
హమాలీ ఆటో అండ్ మోటారు వాహన డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయలేదని కేంద్ర,రాష్ట్ర పాలకుల నిర్లక్ష్య వైఖరి ని విమర్శించారు.బొగ్గు గనుల ను విశాఖ ఉక్కు,రైల్వే లు తదితర ప్రభుత్వ రంగాలను కాపాడుకుంటూనే మెరుగైన జీవితం కోసం పోరాటాలకు కార్మికలోకం ఉద్యమించాలని అందులో భాగంగానే సెప్టెంబర్ 30 న 4 లేబర్ కోడ్ లు,3 నేర చట్టాలను రద్దుచేయాలని,కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ స్కీం వర్కర్ లను పర్మినెంట్ చేసి 26 వేలు కనీస వేతనం ఇవ్వాలని బీడీ కార్మికులకు మరియు రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 73 షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్ జీ ఓ లను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విడుదల చేయాలని భవన ఇతర నిర్మాణ రంగ కార్మికులకు ఇప్పటి వరకు ఇస్తున్న క్లేమ్స్ ను కార్మిక శాఖ నే చేపట్టాలని తదితర డీ.అండ్ ల పై సెప్టెంబర్ 30 న ఛలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా ను రెండు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర కమిటీ ల ఆధ్వర్యంలో చేపట్టామని ఈ ధర్నా లో అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ సదస్సుకు ఐఎఫ్టియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఐ వెంకన్న ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ రాసోద్దీన్ లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు.సదస్సులో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జెసీతారామయ్య ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు గంటా నాగయ్య కొక్కు సారంగపాణి గంగుల దయాకర్ శివారపు శ్రీదర్ ఎస్కే సుబాహన్ తోడేటి నాగేశ్వరరావు దుబాకుల ప్రసాద్ గూగుల్ లోతు పటేల్ బోడ నాగేశ్వరరావు గోపె రవి కాంపాటి మధు ఎల్ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking