తెలంగాణకు వరద నిధుల కేటాయింపులో కేంద్రం వివక్షత
-బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బోయిన వేణు
ఖమ్మం / అక్షిత బ్యూరో :
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు వరద నిధుల కేటాయింపు లో వివక్షతను చూపిందని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు బోయిన వేణు విమర్శించారు. నిన్న నేలకొండపల్లి లో మీడియాతో మాట్లాడుతూ పరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1036 కోట్లు నిధులు కేటాయించి తెలంగాణకు కేవలం 416 కోట్లు మాత్రమే నిధులు కేటాయించిందని ఆయన అన్నారు. ఆపద సమయంలో సాయం చేయడంలో కేంద్రం ఈ విధంగా వివక్షగా వ్యవహరించటం సరి కాదన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీ లు ఉండి కూడా ఇంత తక్కువ నిధులు విడుదల చేయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు.బీజేపీ ప్రభుత్వం ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ నిధులు పారిస్తున్నారని ఆయన ఆరోపించారు.