నేడు సాగర్ కు
పొంగులేటి రాక
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
ఈనెల 5 న రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
మంత్రి శనివారం ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి 11 గంటలకు తిరుమలగిరి సాగర్ మండలం, నెల్లికల్ గ్రామం చేరుకుంటారని, అక్కడ ధరణికి సంబంధించిన రైతులు, సంబంధిత శాఖల అధికారులతో ముఖాముఖి మాట్లాడతారని, అనంతరం అక్కడి నుండి బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు నాగర్జున సాగర్ వద్ద ఉన్న విజయ విహార్ కు చేరుకొని సంబంధిత శాఖల అధికారులతో ధరణి పైలెట్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తారని, అనంతరం మధ్యాహ్నం 3:30గంటలకు తిరిగి హైదరాబాద్ వెళ్తారని కలెక్టర్ తెలిపారు.