“బోడకుంటి” ఆత్మీయ కలయిక

ఆరు తరాల బోడకుంటి కుటుంబీకులు ఒకే వేదికపై కలయిక…!

మాజీ ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు…!!

జనగామ, అక్షిత ప్రతినిధి:

ఆరు తరాల కుటుంబీకులను ఏకం చేసి ఒకే వేదికపై అందరూ కలుసుకొని..కుటుంబాల బాగోగులు… తెలుసుకొని..ఏకమైన సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని శ్రీనిధి ఫంక్షన్ హాల్ లో ఘనంగా కలయికతో సంబరాలు జరుపుకున్నారు. వివరాలలోకి వెళితే మండల కేంద్రానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ప్రభుత్వ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు, బోడ కుంటి వంశీకులు ( ఆరు గురు) తాత ముత్తాతల కుటుంబాల సభ్యులను ఏకం చేసి అందరం ఒకే వేదిక పై నిలిచి అందరి బాగోగులు… తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ఆయా కుటుంబాల సభ్యులు అయిన బోరకుంటీ శ్రీను, బోరకుంటీ క్రాంతి కుమార్, బోరకుంటీ అనిల్, బోరకుంటీ శశిధర్, బోరకుంటీ పృద్విలు ఏకమై తన కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులను కలుస్తూ చరవాణిలో మాట్లాడుతూ… మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వారము మనమందరము ఒక దగ్గర చేరి మన కుటుంబాల, చిన్ననాటి విషయాలను నెమరు వేసుకుంటూ… చిన్ననాటి విషయాలను చెప్పుకుంటూ…ఆయా కుటుంబాలకు చెందిన వారందరూ వస్తామని చెప్పి… ఆదివారం రోజున కలుసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాలలో ఒకరైన మాజీ ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఇలా ఒకే వేదికపై తమందరం చేరుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలానే ప్రతి కుటుంబం కలిసిమెలిసి ఉంటే రాబోయే తరాలకు మనము సందేశాన్ని ఇచ్చిన వారం అవుతామని అన్నారు. కలసిన వారిలో డాక్టర్ బోడ కుంటి రాములు, రిటైర్డ్ టీచర్ బోడ కుంటి మల్లయ్య, బోడకుంటి ప్రభాకర్, తదితర కుటుంబ సభ్యులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking