ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న *జనని హాస్పిటల్ యాజమాన్యం
మేడ్చల్ మల్కాజ్ గిరి, అక్షిత ప్రతినిధి :
ప్రజల ప్రాణాలతో జనని చెలగాటమాడుతుంది.ఇక వివరాలు కి వెళ్తే.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం, తుర్కపల్లి వాస్తవ్యులు తమ కుమారుడు సంవత్సరం లోపు ఉన్న బాబు జలుబుతో వైద్యo నిమిత్తము నాగారం మున్సిపల్ పరిధిలోని జనని హాస్పిటల్ లో.. వైద్యంలో భాగంగా ఎక్స్పైర్ డేట్ తో ఉన్న ఔషధాలను (సిరప్స్) చిన్నపిల్లలకు ఇచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా అనే అనుమానాలకు తావిస్తున్న ఈ ఎక్స్పైర్ డేట్ తో ఉన్న కోర్లీస్ -పి 10-2023 తో ముగిసిన సిరప్ విలువ రూ.82, కానీ రూ.92 తో బిల్ లో చిన్న పిల్లలకు ఇచ్చి ప్రాణాలతో చెలగాటం ఎంతవరకు సమంజసం? దీనిపై ప్రశ్నించిన వారిపై ఎదురుగా ఏం కాదు అంతా మేము చూసుకుంటాం అనే ధోరణితో వ్యవహరించడం వైద్య వృత్తికి విరుద్ధం..? ఈ నిర్వాహకంపై నాగారం మున్సిపల్ లోని జనని హాస్పిటల్ పై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య, ఆరోగ్య సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు.