పక్కాగా ఇంటింటి సర్వే
వేములపల్లి, అక్షిత న్యూస్ :
ఈనెల 6 నుంచి గ్రామాల్లో నిర్వహించనున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని తాహసిల్దార్ కోటేశ్వరి ఎంపీడీఓ శారద దేవిలు అన్నారు శుక్రవారం తాహసిల్దార్ కార్యాలయంలో సర్వేసిబ్బంది కి సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 12 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 36,175 కుటుంబాలు ఉండగావారి వివరాలను సేకరించడానికి గాను 54 మంది ఎన్యుమారేటర్లను నియమించగా సర్వే పర్యవేక్షించడానికి ఆరుగురు సూపర్వైజర్ లను నియమించడం జరిగిందన్నారు శుక్రవారం ఎన్యుమారేటర్ల ద్వారా ఇంటింటికి సర్వే సమాచారాన్ని అందించడం జరుగుతుందని ఈనెల 6 నుంచి ప్రతి ఎ న్యూమరేటర్ రోజుకు 10 కుటుంబాల చొప్పున సమగ్ర వివరాలు సేకరిస్తారన్నారు. గ్రామస్తులు సైతం తమ కుటుంబ పూర్తి వివరాలుతో ఎన్యుమరేటర్లకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ లలిత, కార్యదర్శి గజగంటి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.