పక్కాగా శివరాత్రి
జాతర ఏర్పాట్లు
• ఇక మొదలెట్టాలే
• రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజుర్ నగర్,అక్షిత ప్రతినిధి :
శివరాత్రి జాతర ఘనంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మేళ్లచెర్వు శివాలయంలో వచ్చే శివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో శివాలయానికి రావటం, దేవుడు ఆశీసులు తీసుకోవడం అదృష్టంగా భావిస్తా అని ప్రజలందరికి ఆయురారోగ్యాలు కల్పించాలని సంతోషంగా జీవించాలని కోరుకుంటూ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే శివరాత్రి జాతర కి 5-6 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా శానిటేషన్, త్రాగు నీటి వసతి, పార్కింగ్ లాంటివి భారీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. శివాలయం రాజగోపురం కొరకు 55 లక్షలు కేటాయించి పూర్తి చేశామని తెలిపారు.

1994 నుండి మేళ్లచెర్వు ప్రజలు అత్యంత ఆత్మీయత చూపుతూ 7 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపిగా, మంత్రి గా చేసే అవకాశం కల్పించారని మీ అందరికి రుణ పడి ఉంటా అని మీరందరూ నా కుటుంబ సభ్యులుగా భావిస్తానని అందుకే మీరు పిలవకపోయిన నూతన సంవత్సరం రోజు ఇక్కడికి వచ్చానని,ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తానని తెలిపారు.ఒక్క సంవత్సరంలోనే మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాలో వందల కోట్లతో అభివృద్ధి చేసానని, ప్రతి ఎకరానికి సాగు నీరు అందించటమే నా జీవిత లక్ష్యం అని, అనేక కొత్త లిప్ట్ ఇరిగేషన్ స్కీంలు నిర్మించానని, పాత వాటికి మరమ్మతులు చేపించి రైతులకి సాగు నీరు అందిస్తునాన్ని తెలిపారు. కొత్త లిప్ట్ కొరకు భూసేకరణ కి మానవతకోణంలో రైతులు భూములు ఇవ్వాలని వారికి అత్యధిక ధర ప్రభుత్వం నుండి ఇపిస్తామని అన్నారు. గుండ్లపల్లి లిప్ట్ ఇరిగేషన్ పని చేయటం లేదని రైతులు మంత్రికి తెలపగా మరమ్మతులు చేసి అందుబాటులోకి తేవాలని ఇరిగేషన్ అధికారులని మంత్రి ఆదేశించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ నూతన బిల్డింగ్ కొరకు 4.15 కోట్లు, ఇంటర్ కాలేజీ నూతన బిల్డింగ్ కొరకు 7.5 కోట్లు, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కి 40 కోట్లు, వంద పడకల హాస్పిటల్ లో అదనపు గదులు, సి టి స్కాన్ ఏర్పాటు చేశామని ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా విద్య, వైద్యం, విద్యుత్, సాగు త్రాగు నీరు అందిస్తున్నమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ శ్రీనివాసులు, తహసీల్దార్ జ్యోతి,దేవాలయం చైర్మన్ శంబీరెడ్డి, ఈ ఓ కొండారెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.