కిట కిట లాడిన స్వీట్ షాప్స్
డైమండ్ లో భారీ అమ్మకాలు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
నూతన సంవత్సర వేడుకలలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని స్వీట్స్, బేకరీ షాపులు కిటకిటలాడాయి. జనం న్యూ ఇయర్ కేకులు, స్వీట్స్ కొనేందుకు స్వీట్స్ బేకరి షాపుల్లలో భారీగా వచ్చారు. కస్టమర్లను ఆకర్షించేందుకు విద్యుద్దీపాలతో అలంకరించారు. దుకాణాల ముందు కౌంటర్లు ఏర్పాటు చేశారు. బేకరి షాపులు పోటీపడి కేకుల ధరలు తగ్గించారు.

ఒక షాపులో కిలో కేక్ రూ.400లకు , అరకిలో రూ.200లకు విక్రయిస్తుండగా, మరో షాపులో కిలో కేక్ రూ.300లకు, అరకిలో రూ.150 లకు విక్రయించారు. అయితే ఎక్కువ జనం కూల్ కేక్ కొనుగోలు పట్ల ఆసక్తి కనబరిచారు. మాములు కేక్ ధర కంటే కూల్ కేక్ ధర రెండింతలు ఎక్కువగా ఉన్న ఎగ బడి కొన్నారు. డైమండ్ స్వీట్స్ లో భారీ అమ్మకాలు జరిగాయి. ప్రతి ఏడాది మాదిరిగానే న్యూ ఇయర్ కేక్ ల అమ్మకాలు భారీగా జరిగినట్లు డైమండ్ స్వీట్స్ యజమాని మాశెట్టి ( డైమండ్) శ్రీనివాస్ తెలిపారు.మిర్యాలగూడ పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తెలిపారు.