అభివృధ్ధి పరుగులు…
రేవంత్ మార్క్ గా
ఏడాది పాలన
ఆటుపోట్లను అధిగమిస్తూ అభివృద్ధి దిశగా తెలంగాణ
తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఏడాది ప్రగతి బాటలో రేవంత్ సర్కార్ ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ముద్ర ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని, ఆటు పోట్లను అధిగమిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరకాలం ముగించిందని బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ అన్నారు. శనివారం నాడు ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేస్తూ మూసీ, ఫోర్త్ సిటీ, ఆర్ఆర్ఆర్, మెట్రో, గురుకులాల్లో సమీకృత భవనాలు, ఆర్థికంగా ఆటుపోట్లు ఉన్న ప్రగతి బాటలో రేవంత్ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది అన్నారు. ఏడాది క్రితం అతలాకుతలంగా అప్పుల కుప్పగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర రాబడులు నిర్దేశించిన వ్యయాలకే సరిపోయే పరిస్థితి. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కనిపించని దుస్థితి ఉండేదని నిరాశ జనకంగా రెవిన్యూ, విద్య, వైద్యం, సాగునీటి తదితర రంగాల ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు తీవ్ర నిరాశ నిస్పృహల పాలు చేసినా ధైర్యంగా ముందుకు అడిగేసిన రేవంత్ మార్కు పాలన ఇది అని అన్నారు.
*సొంత ముద్ర సరికొత్త ప్రాజెక్టులు*
గత ముఖ్యమంత్రులు మాదిరిగానే తన మార్కు అభివృద్ధి కూడా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావించి ఉండవచ్చునని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని వైయస్ రాజశేఖర్ రెడ్డి రింగు రోడ్డు నిర్మించినట్లుగానే అభివృద్ధిలో సొంతముద్ర ఉండాలని రేవంత్ ఆలోచించారని అందులో భాగంగానే మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, ఫోర్త్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు, వట్టి మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టారని అన్నారు. మూసీ ప్రక్షాళన పునర్జీవనమే లక్ష్యంగా చేపట్టిన మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు మొత్తం హైదరాబాదు నగరానికి కొత్త కళ తీసుకొని వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు అన్నారు.
*సమీకృత గురుకులాలు*
ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల వారికి వేరువేరుగా గురుకులాలు పాఠశాలలు ఉండేవని వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకరావాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుందని వీటన్నిటిని ఒక ప్రాంగణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరిట ప్రతి నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున నిర్మించాలని కోవడం ఒక ముందడుగు అని మరోవైపు సాగునీటి రంగాల్లో ఏడాది కాలంలోనే పదివేల కోట్ల వరకు ఖర్చు చేసిందని ఇక ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో కొన్నిటిని ప్రభుత్వం అమలు చేసి చూపించిందని రాజీవ్ ఉద్యోగ శ్రీ, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత గృహ విద్యుత్తు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు బియ్యం సబ్సిడీ ఉపకార వేతనాలు డైట్ చార్జీల పెంపు కళ్యాణ లక్ష్మి సాదిముబారక్ తదితర పథకాలన్నింటికి 61 వేల 190 కోట్లు ఖర్చు చేసిన ఘనత తమ ప్రభుత్వానిది అని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రగతి పదం సకల జనహితం ప్రజా ప్రభుత్వం అని అన్నారు.