మునుపటోలే…ఏబీసీడీలుండాలి

*మునుపటోలే*
     ఏబీసీడీలుండాలి

జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో చిరు లోపాలు

• కొన్ని కులాలను కలిపి
4వ గ్రూపు చేయాలి

• మీడియాతో మందకృష్ణ మాదిగ

హైదరాబాద్ అక్షిత ప్రతినిధి :

ఎస్సీలను 1,2, 3 గ్రూపులుగా కాకుండా మునుపటోలే ఏబీసీడీలుగా వర్గీకరించా లని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మొదటి నుంచి తమ పోరాటం ఏ, బీ, సీ, డీ వర్గీకరణ డిమాండ్ తోనే సాగిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ అలాగే అమలు చేశారని గుర్తు చేశారు. వర్గీకరణ తీర్మానానికి ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంగళవారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో మందకృష్ణ భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు చెప్పామన్నారు. సీఎం మొదటి నుంచి వర్గీకరణకు మద్దతు ఇచ్చారని, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వర్గీకరణను ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో రిజర్వేషన్ల శాతం, గ్రూప్ 1,2, 3లో ఉన్న కులాల విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, వీటిని పరిష్కరించాలని సీఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలోని ఎస్సీలలో జనాభా పరంగా మూడో అతిపెద్ద కులంగా ఉన్న నేతకాని వర్గాన్ని, హోలియ దాసరి, మహార్ మరికొన్ని దళిత కులాలను కలిపి ప్రత్యేక గ్రూప్ గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్టు మంద కృష్ణ తెలిపారు.

తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా ఇచ్చామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. వర్గీకరణ ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఎస్సీల రిజర్వేషన్లను 15 శాతం నుంచి 18 శాతం పెంచుతామన్న చేవెళ్ల డిక్లరేషన్ ను కూడా అమలు చేయాలని కోరారు. ఈ భేటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, దళిత, ప్రజాసంఘాల నేతలు ఎంఆర్ పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్ మాదిగ, సయ్యద్ ఇస్మాయిల్ పాల్గొన్నారు.

*ఉత్తమ్ తో భేటీ*

సీఎంరేవంత్ రెడ్డితో చర్చలు అనంతరం సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని
ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విజయ సారథి,
పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ, ఉప కులాల ప్రతినిధులతో పాటు ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్, ఐఏఎస్ శ్రీధర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking