అక్షిత అక్షరం… ప్రజాయుధం
ఉప్పల శ్రీనివాస్ గుప్త
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ఉన్నది ఉన్నట్లు…ఉండదు కనికట్టు తరహా ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రంగా ప్రజల సమస్యలను పరిష్కరించే వేదికగా అక్షిత అక్షర యజ్ఞం సాగిస్తుందని టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. సోమవారం అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక 2025 క్యాలెండర్ ను అక్షిత గ్రూప్ ఆఫ్ న్యూస్ పేపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దాస్ మాతంగి, తెలంగాణ చిన్న మధ్యతరహా దిన మాస పత్రికల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కోటగిరి దైవాదీనంతో కలిసి ఉప్పల శ్రీనివాస్ గుప్త చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు… ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజాయుధంగా అక్షిత తెలుగు జాతీయ దినపత్రిక ముందుకు సాగుతుందన్నారు. నిజాలను నిర్భయంగా… స్వేచ్ఛగా రాస్తూ ప్రజల సమస్యలకు వాస్తవ దర్పణం పడుతుందన్నారు. వివిధ ప్రధాన స్రవంతి కల్గిన పత్రికల్లో విశిష్ట సేవలందించిన అనుభవంతో చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి సారథ్యంలో గత పదిహేనేళ్లుగా అక్షిత అక్షర సమరం మోగిస్తుందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. మూడు దశాబ్దాల తన జర్నలిజం పయనంలో ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లుగా వార్తలు రాస్తూ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని ఆయన అభిప్రాయ పడ్డారు. అక్షిత తెలుగు జాతీయ దిన పత్రికను గత పదిహేనేళ్లుగా ప్రజల సంక్షేమం, అభివృద్ధికై అక్షిత అక్షర శంఖారావం సాగిస్తూ ప్రజల మన్ననలు పొందుతుందన్నారు.
*మన వేదిక క్యాలెండర్* *ఆవిష్కరణ*
మన వేదిక తెలుగు దిన పత్రిక ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాదీనం రూపొందించిన క్యాలెండర్ 2025ను టీపీసీసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి, ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆవిష్కరించారు.
ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ మన వేదిక అక్షర యజ్ఞం సాగిస్తూ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట అక్షిత చీఫ్ ఎడిటర్ దాస్ మాతంగి ఉన్నారు.