అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవు
ఎస్సై అపూర్వ రెడ్డి
చేర్యాల, అక్షిత ప్రతినిధి: ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను చేర్యాల పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి తెలిపిన వివరాలు పూర్తి సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా.. ఆలేరు మండలం లోని కొలను పాకకు చెందిన ఓ రైతు పట్టా భూమి నుండి నల్ల రేగడి మట్టిని తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్సై అపూర్వ రెడ్డి తన సిబ్బందితో కలిసి చేర్యాల మండలంలోని ముత్యాల గ్రామ శివారులో ఇటుక బట్టికి వెళ్తుండగా తనిఖీలు నిర్వహించి నల్ల రేగడి మట్టి తరలిస్తున్నారనే దానికి అక్కడికి వ్వెళ్ళి చూడగా 5 టిప్పర్లు నల్ల మట్టి లోడ్ తో కనిపించాయి. వాటిని అనుమతి పత్రాలు, వాటిని తీసుకోని పోలీసు స్టేషన్ కి తరలించి, చట్టపరమైన చర్యలు కోసం మైనింగ్ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ లేదా మట్టి రవాణా కు పాల్పడితే సహించేది లేదని ఎస్సై అపూర్వ రెడ్డి హెచ్చరించారు.