తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా బూరుగు వెంకటేశం.

తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా బూరుగు వెంకటేశం.

రామన్నపేట అక్షిత ప్రతినిధి

రామన్నపేట మండల కేంద్రానికి చెందిన బూరుగు వెంకటేశం ను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఈ మేరకు చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమ్మోహన్ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. రామన్నపేట పట్టణానికి చెందిన బూరుగు వెంకటేశం రామన్నపేట పట్టణ, మండల పద్మశాలి సంఘం ఏర్పాటు విషయంలో కీలకంగా వ్యవహరించడంతోపాటు సంఘ బలోపేతానికి సాయశక్తుగా చేస్తున్నారు. చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతున్న ఆయనను క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా నియామకం కావడంతో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు రచ్చ యాదగిరి, డీసీఎంఎస్ మాజీ జిల్లా డైరెక్టర్, రామన్నపేట కాటన్ చేనేత సహకార సంఘం అధ్యక్షులు జేల్ల వెంకటేష్, పద్మశాలి సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి కైరంకొండ నాగభూషణ్, నాయకులు రవ్వ నరసింహ, రవ్వ సత్యనారాయణ, మహేశ్వరం అశోక్, కైరంకొండ నందు, చలమల గోపాల్, హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking