శభాష్ గూడెం కార్యదర్శి రాంబాబుకు ఘనంగా వీడ్కోలు
చేర్యాల, అక్షిత ప్రతినిధి :
చేర్యాల మండలం శభాష్ గూడెం గ్రామపంచాయతీ సెక్రటరీ గా రాంబాబ పనిచేసి ఇటీవల బదిలీపై వెళ్లిన సందర్భంగా సోమవారం కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాజపేట జాన్, కాంగ్రెస్ నాయకు లతో కలిసి కార్యదర్శి రావుల రాంబాబు కు శాలువతో ఘనంగా సత్కరించి వీడ్కోలు సమావేశా న్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కార్యదర్శి రాంబాబు పని చేసిన రోజుల్లో గ్రామానికి ఎన్నో సేవలు అందించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి సహకరించి అమూల్యమైన సేవలు అందించారు. ఇలాంటి కార్యదర్శి వ్యక్తికి మా గ్రామం నుండి ఏమిచ్చినా తక్కువేనని, మా గ్రామం నుండి తను బదిలీపై వెళ్లిపోవడం బాధగా ఉందని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు యమ సిద్దులు, పార్టీ సీనియర్ నాయకులు శ్రీరాముల, ఉప్పలయ్య, ఇందిరమ్మ కమిటీ చైర్మన్ దాసరి శ్రీశైలం, ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు గంగిబాబు, చికోటి నర్సింలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.