ఘనంగా బత్తుల కృష్ణగౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా బత్తుల కృష్ణగౌడ్ జన్మదిన వేడుకలు

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బత్తుల కృష్ణగౌడ్ జన్మదిన వేడుకలను సోమవారం రామన్నపేట పట్టణ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుత్తా నర్సిరెడ్డి, పూస బాలకిషన్, రాయిని రమేష్, ఎండి అక్రమ్, సాల్వేరు అశోక్, రామన్నపేట ఉపసర్పంచ్ మోటె రమేష్, వార్డు సభ్యుడు అమ్జద్, కొమ్ము శేఖర్, నోముల ప్రవీణ్, ఏటెల్లి ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking