ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించండి… వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి..

 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించండి… వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి..

కక్కిరేణి గ్రామ సర్పంచ్ చిల్ల మధురవేణి సురేష్ పిలుపు

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఈరోజు పాఠశాల పునః ప్రారంభోత్సవం రోజున ఊరిలో ఉన్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకి ఆహ్వానిస్తూ బడిబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జిల్లా మధురవేణి సురేష్ గారు మాట్లాడుతూ బడి ఈడు పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలని అలా చదివిన విద్యార్థుల తల్లిదండ్రులకే సంక్షేమ పథకాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న పై అధికారుల సూచనలను ఈ సందర్భంగా తల్లిదండ్రులకు గుర్తు చేశారు.. ప్రభుత్వ పాఠశాలలో అనేక అవకాశాలు కల్పించుకోవడం కోసం దాతలు ముందుకు రావాలని కోరారు.అనంతరం కక్కిరేణి గ్రామానికి మధిర గ్రామమైన రంగమ్మ గూడెంలో ఇంటింటికి తిరుగుతూ తల్లిదండ్రులను మీ విద్యార్థులను పాఠశాలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి తల్లిదండ్రులు స్పందిస్తూ రవాణా సౌకర్యం గనుక కల్పిస్తే మా పిల్లల్ని కక్కిరేణి పాఠశాలలో చేర్పిస్తామని తల్లిదండ్రులు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ నడిగోటి పాండు ప్రధానోపాధ్యాయులు బి. ఉపేందర్ జి , ఉపాధ్యాయులు రాజన్ బాబు , భద్రయ్య ,గణేష్ గోపాల్ రెడ్డి , శ్రీనివాసరావు , శేఖర్ రెడ్డి , కృష్ణ , స్వర్ణలత , జ్యోతి , గ్రామ వార్డు సభ్యులు చిల్ల చంద్రశేఖర్ , కోళ్ల సుమలత వెంకన్న , బోడ మనీషా నరసింహ , పిండి సైదులు , చిల్ల మధు , నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking