తప్పుడు ప్రచారలతో అడ్మిషన్స్ తీసుకుంటు, నిబంధనలు పాటించని పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

తప్పుడు ప్రచారలతో అడ్మిషన్స్ తీసుకుంటు, నిబంధనలు పాటించని పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలి

 

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారికి వినతి

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులను మోసగిస్తున్న పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని, జిల్లా విద్యాధికారులు పర్యవేక్షణ చేసి సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేముల నాగరాజు,లావుడ్య రాజు డిమాండ్ చేశారు.రామన్నపేట పల్లవి మోడల్ స్కూల్ గుర్తింపును రద్దుచేసి చర్య తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి బిక్షపతి కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజులు నిర్ణయం చేసి లేనిపోనివి చూయించి విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, సీబీఎస్ఈ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మోసగిస్తున్నారని అన్నారు.మోడల్ స్కూల్ అంటూ తోక పేరు తగిలించి ప్రచారం చేయకూడదని నిబంధనలు తుంగలో తొక్కి యాజమాన్యం వ్యవహరిస్తుంటే విద్యాధికారులు చూసి చూడనట్టు వివరిస్తున్నారని విమర్శించారు. గ్రామీణ ప్రాంతమైన రామన్నపేట మండల కేంద్రంలో అధిక ఫీజుల సంస్కృతిని తీసుకువచ్చి పేద విద్యార్థులని, తల్లిదండ్రులని మోసగిస్తున్నారని. నూతన పాఠశాలలకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఎవరు అనుమతి ఇవ్వరని కానీ పదవ తరగతి వరకు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెంటనే జిల్లా విద్యాధికారులు పర్యవేక్షించి పాఠశాల యాజమాన్యంపై చర్య తీసుకొని పాఠశాల గుర్తింపును రద్దు చేయకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్ కుమార్,జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఇందు రాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking