ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తా

ఉపసర్పంచ్‌ల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తా


– మోటే రమేష్

రామన్నపేట అక్షిత ప్రతినిధి

రామన్నపేట మండల ఉపసర్పంచ్‌ల లా ఫోరం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మోటే రమేష్‌ను సోమవారం పట్టణ కేంద్రంలోని రహదారి బంగ్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మోటే రమేష్ మాట్లాడుతూ ఉపసర్పంచ్‌ల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి ఉపసర్పంచ్‌ల పాత్ర కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుత్తా నర్సిరెడ్డి, పూస బాలకిషన్, రాయిని రమేష్, ఎండి అక్రమ్, సాల్వేరు అశోక్, బత్తుల కృష్ణ, వార్డు సభ్యుడు అమ్జద్, కొమ్ము శేఖర్, నోముల ప్రవీణ్, ఏటెల్లి ప్రవీణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రమేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking