సేవ కార్యక్రమాలతో కునూరు పుట్టినరోజు వేడుకలు 

సేవ కార్యక్రమాలతో కునూరు పుట్టినరోజు వేడుకలు 

ఆర్భాటాలకు దూరంగా.. అమ్మానాన్న ఆశ్రమంలో అన్నదానం చేసిన బోగారం సర్పంచ్ కునూరు

బోగారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ 

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు దూరంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. రామన్నపేట మండలంలోని బోగారం గ్రామ సర్పంచ్ కునూరి సాయికుమార్ గౌడ్. తన జన్మదినాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్‌లోని అమ్మానాన్న ఆశ్రమంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.ఆశ్రమంలోని వృద్ధులు, నిరాశ్రయులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకున్న ఆయన, అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికీ భోజనాలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆశ్రమవాసులతో ఆత్మీయంగా ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు సాయికుమార్ గౌడ్ సేవాభావాన్ని అభినందించారు. సమాజంలోని నిరుపేదలు, వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సర్పంచ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు, అభిమానులు, ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో రామన్నపేట మండల పరిధిలోని బోగారం పాఠశాల విద్యార్థుల సందడితో కళకళలాడింది. 2026-27 విద్యా సంవత్సరానికి శ్రీకారం చుడుతూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు.స్థానిక సర్పంచ్ కునూరు సాయి కుమార్ గౌడ్ పుట్టినరోజు సందర్బంగా వారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన విద్య ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking