ఆయిల్ పామ్ తోటల పరిశీలన*
రైతులకు సాంకేతిక సూచనలు అందించిన జిల్లా ఉద్యానపట్టు పరిశ్రమల అధికారి బివి.రమణ
లోకేశ్వరం, అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పంచగుడి, వాట్టోలి గ్రామాల్లో రెండో,మూడో,నాలుగో సంవత్సరం ఆయిల్ పామ్ పంటలను సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను నిర్మల్ జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి బి.వి.రమణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయిల్ పామ్ తోటల పెరుగుదల, మొక్కల ఆరోగ్యం, సాగు పద్ధతులు, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ తదితర అంశాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని, ఉద్యాన శాఖ సూచనలను పాటించాలని రైతులకు సూచించారు.అలాగే ఆయిల్ పామ్ సాగులో ఎదురవుతున్న సమస్యలను రైతుల నుంచి తెలుసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఆయిల్ పామ్ సాగు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే లాభదాయక పంటగా మారుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన అధికారి జావేద్ పాషా,ఉద్యాన విస్తరణ అధికారి,మోయిన్ మియా ఆయిల్ పామ్ సంస్థ మేనేజర్ ఆకాష్,క్లస్టర్ ఆఫీసర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.రైతులు పెద్ద సంఖ్యలో హాజరై అధికారులతో తమ అనుభవాలను పంచుకున్నారు…