రాఘవేంద్ర నగర్ కాలనీ డ్రైనేజీ మరమ్మత్తు పనులను పర్యవేక్షించిన మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్..
శేరిలింగంపల్లి, అక్షిత ప్రతినిధి :
కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీ, సీ-బ్లాక్ మెయిన్ రోడ్డులో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ల మరమ్మత్తు పనులను ఈ రోజు కొండాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ హమీద్ పటేల్ ప్రత్యక్షంగా సందర్శించి పర్యవేక్షించారు.గత కొంతకాలంగా డ్రైనేజీ లైన్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి మరమ్మత్తు పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలించిన హమీద్ పటేల్, పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులకు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, కొండాపూర్ డివిజన్ అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ ప్రజలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. మౌలిక వసతుల మెరుగుదల కోసం అవసరమైన ప్రతి అంశంపై నిరంతరం అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రజా సమస్యలపై స్పందిస్తూ, పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తున్న హమీద్ పటేల్ ని స్థానిక కాలనీవాసులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ హమీద్ పటేల్ , వాటర్ వర్క్స్ మేనేజర్ అరుణ్, సిబ్బంది, పలువురు స్థానికులు పాల్గొన్నారు.