అత్యాధునిక వైద్య రంగంలో యశోద ఆసుపత్రి

*అత్యాధునిక వైద్య రంగంలో యశోద ఆసుపత్రి

-*డాక్టర్ బి శ్రీనివాస్ బొట్ల సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్

*అత్యాధునిక వెన్నుముక శాస్త్ర చికిత్స విజయవంతం

*అపోహలు వద్దు ఆపరేషన్ తర్వాత స్వేచ్ఛగా నడుస్తున్న రోగులు

రంగా రెడ్డి, అక్షిత బ్యూరో:

ఇబ్రహీంపట్నం పట్టణ కేంద్రంలో శ్రీకళ కన్వెన్షన్ హాల్ లో యశోద హాస్పిటల్ మలక్ పేట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ బొట్ల మాట్లాడుతూ, వెన్నెముక శాస్త్ర చికిత్స తర్వాత పక్షవాతం వస్తుందని, జీవితాంతం మంచాన పడాల్సి వస్తుందని భయాలు, అపోహలు చాలామందిలో ఉన్నాయని అన్నారు. నేటి ఆధునిక వైద్య సాంకేతికతో ఈ అపోహలు అన్ని పటా పంచలవుతున్నాయి.

తీవ్రమైన వెన్నుముక, మెడ నొప్పి నరాల నొక్కుడు సమస్యతో కదలలేని స్థితికి చేరుకున్న ఒక రోగికి మలక్ పెట్ యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా మల్టీ లెవెల్ స్పైనల్ పికేషన్ సర్జరీని పూర్తి చేశారు. కాలం చెల్లిన నమ్మకాలను పక్కనపెట్టి సకాలంలో సరైన వైద్య నిర్ణయం తీసుకుంటే వెన్నుముక సమస్య నుంచి సంపూర్ణ విముక్తి సాధ్యమని విజయగాదా నిరూపిస్తోంది.
L1,L5, స్థాయిలలో రెండు వైపులా ఫెడికల్ స్క్రూలు అమరిక.
ఎడమవైపు L2, L4 కుడి వైపు L3 స్థాయిలలో పెడికల్ స్క్రూలు అమరిక.
L1,L3,L4, స్థాయిలలో లామినేట్ మీ నరాల ఒత్తిడి తొలగింపు.
L4-L5 డిస్కెట్ మీ ద్వారా నరాల మూలాలను విముక్తం చేయడం.
టైటానియం రాడ్లతో వెన్నుముక స్థిరీకరణ.
బహుళ స్థానాలలో నరాలపై ఒత్తిడిని విజయవంతంగా తొలగించడం శాస్త్ర చికిత్స ఎటువంటి ప్రధాన సమస్యలు లేకుండా విజయవంతంగా పూర్తయింది. సమగ్ర శాస్త్ర చికిత్స అనంతరం సంరక్షణ.

శాస్త్ర చికిత్స అనంతరం రోగికి

ఐవి యాంటీ బయాటిక్స్ నొప్పులు నివారణ మందులు
ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో నడక శిక్షణ.
సూర్యో లాజికల్ మానిటరింగ్.
పునరావాస (రేబిలిస్టేషన్)సేవలు.
నిరంతరం వైద్య పర్యవేక్షణ.
గాయం సంరక్షణ సహాయక చికిత్సలు. డాక్టర్ల అభిప్రాయం

** రోగి ఏలేటి విమల మాట్లాడుతూ గత కొంతకాలంగా నేను వెన్నుముక నొప్పితో బాధపడుతూ అనేక ఆసుపత్రులు తిరిగానని, ఆయా ఆసుపత్రుల వైద్యులు తాత్కాలిక మందులు ఇచ్చి ఉపశమనం కల్పించారని, కానీ శాశ్వత పరిష్కారం లభించలేదని ఆమె అన్నారు. ఆమె కొడుకు వేరే వారి ద్వారా విషయం తెలుసుకొని యశోద ఆసుపత్రి మలక్పేట్ బ్రాంచ్ కి తీసుకెళ్లడం జరిగిందని ఆమె అన్నారు. డాక్టర్ శ్రీనివాస్ బొట్ల ఆధ్వర్యంలో నాకు మే 5 2026న శాస్త్ర చికిత్స నిర్వహించడం జరిగిందని, ఈ సర్జరీ కి ఐదు గంటల సమయం పట్టిందని ఆమె అన్నారు. ఈ సర్జరీ జరిగి నెల 15 రోజులు అవుతుందని ప్రస్తుతం నేను ఎలాంటి సహాయం లేకుండా నడుస్తున్నానని, నా పనులు నేనే చేసుకుంటున్నాను అని ఆమె అన్నారు. నాకు శస్త్ర చికిత్స చేసి నన్ను మామూలు మనిషిని చేసిన డాక్టర్ శ్రీనివాస్ బొట్లకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాసు కిరణ్ రెడ్డి, యశోద ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking