2బీహెచ్‌కే ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

2బీహెచ్‌కే ఇళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

రాయపర్తి అక్షిత ప్రతినిది

మండలంలోని గన్నారం గ్రామంలోని 2బీహెచ్‌కే గృహాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పరిశీలించారు. ఈ సందర్భంగా గృహాల నిర్మాణ స్థితి, మౌలిక వసతులు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2బీహెచ్‌కే ఇళ్ల కేటాయింపులో పారదర్శకత పాటించాలని, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఇందిరమ్మ ఇండ్ల నోడల్ అధికారి, జెడ్పీ సీఈవో రాంరెడ్డిని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హుల జాబితాను రూపొందించి, నిజమైన నిరుపేదలకు గృహాల ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి వివక్షకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. మరియు తెట్టె కుంట తండాలోని ప్రభుత్వ పాఠశాల అంగన్వాడి సెంటర్ వాటర్ ట్యాంకులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో రాంరెడ్డి, వరంగల్ ఆర్డీవో సుమ , రాయపర్తి తహసిల్దార్ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు, కలెక్టర్ వెంట ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking