పారదర్శకతకు ప్రతీక “రాజా”

పారదర్శకతకు ప్రతీక “రాజా”

రాజా ఇన్‌ఫ్రా డెవలపర్స్‌కు ప్రతిష్టాత్మక బెస్ట్ ఆర్గనైజేషన్ 2025 అవార్డు

రాజా” కు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

కస్టమర్ల నమ్మకం… విశ్వాసం.. పారదర్శకతకు ప్రతీక “రాజా”. వేలాది మంది ఇన్వెస్టర్ల మదుపుకు భరోసా. పెట్టిన పెట్టుబడికి నిక్కచ్చి విలువలను పెంచేందుకు రాజా ఇన్ ఫ్రాడెవలపర్స్ కృషి విశిష్టo. రియల్ రంగంలో తమదైన శైలిలో .. ఇన్వెస్టర్ల మనసును దోచుకుంటూ రారాజుగా ముద్ర వేసుకుంటుండ్రు.

ఎక్కడ వెంచర్లు వేసినా… అదే కస్టమర్లు ఆయా వెంచర్లలో కొనుగోలు చేయడం రాజా ఇన్ ఫ్రాడెవలపర్స్ విశ్వసనీయతకు ప్రతీక.రియల్ ఎస్టేట్ రంగంలో విశిష్ట సేవలు అందిస్తూ, వినూత్న ప్రాజెక్టులతో వేల మందికి సొంతింటి కలను సాకారం చేస్తున్న రాజా ఇన్‌ఫ్రా డెవలపర్స్ మరో ఘనతను తన ఖాతాలో పదిల పరుచుకుంది. 2025 సంవత్సరానికి గాను, హైబిజ్ టీవీ ప్రదానం చేసే “బెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ రియల్ ఎస్టేట్ సెక్టార్” అవార్డును హెచ్ఐసిసి నోవాటల్ లో రాజా ఇన్‌ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు అందుకున్నారు.

ఈ సందర్భంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయత, నాణ్యత, పారదర్శకతతో  కస్టమర్లు, ఇన్వెస్టర్లకు రిజల్ట్ ఓరియెంటెడ్ వెంచర్లు అందించడం సంస్థ లక్ష్యం. కస్టమర్లకు అత్యుత్తమమైన సేవలందించడం మా ప్రాధాన్యత అని మా సంస్థ ప్రారంభమైనప్పటి నుండి వేలాది మందికి నాణ్యమైన స్థలాలను అందించడమే కాకుండా, విభిన్న ప్రయోజనాలు కలిగిన వెంచర్లను అభివృద్ధి చేసి, పెట్టుబడి దారులకు గొప్ప ఆదాయ అవకాశాలను అందిస్తున్నామన్నారు. కస్టమర్ల విశ్వాసమే మా విజయ రహస్యమని చెప్పారు.ఈ ప్రతిష్టాత్మక అవార్డు మా సంస్థకు దక్కిన అనేక గౌరవాల్లో ఒకటి మాత్రమే. ఇది మాకు మరింత బాధ్యతను పెంచింది. మా కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, రియల్ ఎస్టేట్ రంగంలో మరిన్ని మైలురాళ్లు చేరడానికి ఇది ప్రేరణగా మారుతుంది అని చెప్పారు.

మా విజయం – మా కుటుంబ విజయం

ఈ ఘనత కేవలం మా సంస్థది మాత్రమే కాదు, మా ప్రతి కస్టమర్, ప్రతి ఉద్యోగి, ప్రతి భాగస్వామి, ప్రతి మిత్రుని విజయము కూడా. ఈ విజయాన్ని సాధించడంలో మాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మీరు మమ్మల్ని నమ్మి మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాజా ఇన్‌ఫ్రా డెవలపర్స్ మీ భవిష్యత్తుకు భరోసా అని, రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్నమైన ప్రాజెక్టులను మీ ముందుకు తీసుకురావడానికి మేము కృషి చేస్తామన్నారు. మీ విశ్వాసం, మద్దతుతో రియల్ ఎస్టేట్ రంగంలో భారతదేశంలోనే అగ్రగామిగా రాజా ఇన్ ఫ్రాడెవలపర్స్ ఎదగాలన్న మా లక్ష్యాన్ని నెరవేర్చడంలో ముందుకు సాగుతామన్నారు.
మీ ఆదరణ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మా వెంట ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రెడాయి ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ శేఖర్ రెడ్డి, ఎంఎల్ సి ఆమీర్ అలీఖాన్ ( ద సియాసత్ డైలీ ఎడిటర్ ) జయభేరి అధినేత, సినీ హీరో మురళీమోహన్, హైబిజ్ టీవీ అధినేత రాజగోపాల్, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, అపర్ణ, వాసవి, హానర్, రహేజా, సత్తవా, రాజ్ పుష్ప, వంశీరామ్ బిల్డర్స్, ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రా, సైబర్ సిటీ బిల్డర్స్, జయభేరి, అర్బన్ రైజ్, సుచిర్ ఇండియా, ఏస్ వెంచర్స్, ఇండస్, జనప్రియ, ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking