పుట్ట గొడుగుల్లాగా వెలసిన.. హోర్డింగ్స్ పై హైడ్రా ఫోకస్..
అనుమతిలేని హోర్డింగ్స్,పై.అనుమతి ఉన్నా టాక్స్.. చెల్లించని హోర్డింగ్స్ పై హైడ్రా అధికారుల నజర్..
దుండిగల్ పురపాలకలో ఎక్కడ చూసినా హోర్డింగ్స్ భారీగా ఏర్పాటు
అనుమతుల వివరాలు సేకరించే పనిలో హైడ్రా అధికారులు ఉన్నట్లు సమాచారం..
మేడ్చల్,అక్షిత బ్యూరో :
దుండిగల్ పురపాలక లో పుట్టగొడు గుల్లాగా వెలసిన కమర్షియల్ హోర్డింగ్స్ పై హైడ్రా అధికారులు ఫోకస్ పెట్టారు. హైడ్రా కమీషనర్ ఏ.వి.రంగనాధన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు దుండిగల్ పురపాలక ఆరు గ్రామాల్లో వెలసిన హోర్డింగ్స్ వివరాలు సేకరించి పనిలో పడ్డారు,హోర్డింగ్ వివరాలు అందించేందుకు మున్సిపల్ అధికారులు తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. ఓ బిఆర్ఎస్ ఎమ్యెల్యే కుమారునివి కావడం సదరు వ్యక్తి రెండు అనుమతులు పది హోర్డింగ్స్ అన్నట్లుగా అక్రమంగా నిర్మించినట్లు సమాచారం,సదరు వ్యక్తి అనుమతిలేని హోర్డింగ్స్ ద్వారా ప్రతి నెలా లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

కమర్షియల్ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలంటే మున్సిపల్ సెక్షన్ 83 మున్సిపల్ యాక్ట్ 2019 అండర్ సెక్షన్ 251 ప్రకారం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం పొందాలి,ప్రతి ఏటా సంబంధిత పురపాలక సంఘానికి టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ అనుమతులు పొంది ఇష్టానుసారంగా నిర్మించి టాక్స్ ఎగ్గొట్టుతున్నట్లు సమాచారం అండడంతోనే హైడ్రా అధికారులు రంగ ప్రవేశం చేసినట్లు సమాచారం..

సమాచారం అందించేందుకు అధికారులు వెనకడుగు
దుండిగల్ పురపాలక లో సుమారు 20 కంపెనీల ద్వారా ఇబ్బడి ముబ్బడిగా అనుమతిలేని హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంతో సమాచారం అందుకున్న హైడ్రా అధికారులు సోమవారం హోర్డింగ్ వివరాలు సేకరించేందుకు మున్సిపల్ అధికారులను సంప్రదించినట్లు సమాచారం,ఓ బిఆర్ఎస్ ఎమ్యెల్యే కుమారునికి చెందిన హోర్డింగ్స్ ఎక్కువగా ఉండడంతో తప్పులు తడకతో సమాచారం అందించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
హోర్డింగ్ కూల్చివేతలు జరిగేనా ?
అనుమతిలేని హోర్డింగ్స్,అనుమతి ఉన్నా టాక్స్ చెల్లించని హోర్డింగ్స్ పై హైడ్రా అధికారులు నజర్ పెట్టారు,శంషాబాద్ తదితర ప్రాంతాల్లో టాక్స్ చెల్లించని హోర్డింగ్స్ ను గుర్తించిన హైడ్రా అధికారులు ఇప్పటికే కూల్చివేతలు చేపట్టారు, శివారు మున్సిపాలిటీలపై నజర్ పెట్టిన హైడ్రా అధికారులు,సోమవారం దుండిగల్ మున్సిపాలిటీ నుండి వివరాలు సేకరించినట్లు సమాచారం,కొంపల్లి మున్సిపాలిటీలో ఇప్పటికే వివరాలు సేకరించిన హైడ్రా అధికారులు త్వరలో కూల్చివేతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది…