ఆస్తిపన్నుపై 90% వడ్డీ రాయితీ..

ఆస్తిపన్నుపై 90% వడ్డీ రాయితీ..

 ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి : కమిషనర్..

మేడ్చల్,అక్షిత బ్యూరో :
రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్నుపై 90% వడ్డీ రాయితీని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దుండిగల్ పురపాలక కమీషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ కోరారు. ఆస్తి పన్ను బకాయిలపై ఉంచబడిన వడ్డీలో 90 శాతం మాఫీ చేస్తూ ఆస్తిపన్ను బకాయి దారులు అందరికీ వెసులుబాటు కల్పిస్తూ అన్ని మున్సిపాలిటీలలో ఈ అవకాశం వర్తించేలా బకాయిలపై వడ్డీ 90 శాతం కల్పించేందుకు ఒన్ టైం సెటిల్మెంట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ అవకాశాన్ని 31.0 3 20 25. వరకు మాత్రమే అమల్లో ఉంటుంది కావున ఆస్తిపన్ను బకాయిలు ఉన్నవారందరూ మొత్తం ఆస్తిపన్ను వెంటనే చెల్లించి సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇదివరకు బకాయిలు ఆస్తి పన్నులు వడ్డీతో సహా చెల్లించిన వారికి బకాయి వడ్డీ పై 90 శాతం మాఫీ చేయబడిన అమౌంటు రాబోయే ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ టాక్స్ కింద సర్దుబాటు చేయడం జరుగుతుందని ఈ సువర్ణ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర నాయక్ కోరారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking