హిమాలయ బేబీకేర్ ‘జెంటిల్ యాజ్ డాడ్’ క్యాంపెయిన్ ప్రారంభం

హిమాలయ బేబీకేర్ ‘జెంటిల్ యాజ్ డాడ్’ క్యాంపెయిన్ ప్రారంభం
మృదువైన స్పర్శ ఆనందకరమే..

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

భారతదేశంలో నెంబర్ వన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే బేబీకేర్ బ్రాండ్ హిమాలయ బేబీకేర్ ఫాదర్స్ డే సందర్భంగా హృదయాన్ని హత్తుకునే వీడియో ఫిల్మ్‌ను విడుదల చేసింది. ప్రసిద్ధ కన్నడ పాట ‘ఐ లవ్ యూ అప్పా’ స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన ఈ ‘జెంటిల్ యాజ్ డాడ్’ క్యాంపెయిన్ తండ్రి, కూతురి మధ్య అనుబంధాన్ని ఎంతో భావోద్వేగంతో చెబుతుంది. పుట్టుక నుంచి పెళ్లి వరకు గల బంధం ఇందులో ఉంది. ప్రాంతీయ ప్రేక్షకులతో అనుబంధం ఏర్పడేలా ఈ పాటను హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషలలోకి అనువదించారు. ఈ ఫిల్మ్ ఒక శక్తివంతమైన దృశ్యంతో మొదలవుతుంది. ఆరువై దశకంలో ఉన్న తండ్రి అద్దం ముందు రెడీ అవుతుండగా.. పెళ్లి కూతురు వేషధారణలో ఉన్న చిన్నపాప ‘అప్పా’ అంటూ పిలుస్తుంది. ఒక ఫోటో ఆల్బమ్‌ను అందిస్తుంది. ఆ ఆల్బమ్‌లోని పేజీలు తిరగేస్తుండగా తండ్రి దృష్టిలో కనిపించే అనేక భావోద్వేగాల ప్రయాణం ఆరంభం అవుతుంది. బేబీ మసాజ్ ఆయిల్, బేబీ సోప్, లోషన్‌తో పాపతో ఆడుకుంటూ చేసిన చిన్న చిన్న మధుర క్షణాలు హృదయాన్ని హత్తుకుంటుంది. ఈ క్షణాలు ‘ఐ లవ్ యూ అప్పా’ అనే మధుర గీతంతో కలిపారు. తండ్రిని కేవలం సంరక్షకుడిగా మాత్రమే కాకుండా, ఒక బలమైన ఆధారంగా కూడా ఇందులో చూపిస్తారు. పిల్లల జీవితంలో తండ్రి పాత్ర ఈ ప్రచారంలో హృదయాన్ని తాకుతుంది. ఈ కథనంలో హిమాలయ బేబీకేర్ ఉత్పత్తులు బేబీ మసాజ్ ఆయిల్, బేబీ సోప్, బేబీ లోషన్.. తండ్రి, పిల్లల మధ్య మధుర అనుభవాల్లో సహజంగానే మిళితమై ఉంటాయి. శాస్త్రీయతతో హెర్బల్ కేర్‌ను అందించే ఈ ఉత్పత్తులు తండ్రి పాత్రను మరింత అర్థవంతంగా చూపిస్తూ, ప్రేమ, పెంపకం, మార్గదర్శనం వంటి ప్రతి అంకంలో ఓ మౌన భాగస్వామిగా ఎంతో హృద్యంగా ఉంటుంది.

ఈ సందర్భంగా హిమాలయ వెల్‌నెస్ కంపెనీ బేబీకేర్ డైరెక్టర్ చక్రవర్తి ఎన్వీ మాట్లాడుతూ తండ్రి ఎప్పుడూ పిల్లల జీవితంలో మౌనమైన ఆధార స్తంభాలుగా ఉంటారన్నారు. ఎప్పుడూ పిల్లల వెనుక నిలబడి ప్రేమతో వారి ప్రపంచాన్ని నిర్మించే వారుగా ఉంటారని తెలిపారు. ఈ క్యాంపెయిన్తో తండ్రుల శక్తిని గౌరవించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ‘ఐ లవ్ యూ అప్పా’ పాట సాంస్కృతిక భావోద్వేగాన్ని కలిగి ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనుసంధానమయ్యే కథ ద్వారా ఒక రక్షకుడిగా, స్నేహితుడిగా, మార్గదర్శిగా ఉన్న ప్రతి తండ్రిని గౌరవించడమే లక్ష్యమన్నారు.
ఈ సందర్భంగా సోషియల్ పంగా సహస్థాపకుడు హిమాన్షు అరోరా మాట్లాడుతూ ఈ ఫాదర్స్ డే సందర్భంగా మా ప్రచారం తండ్రులు, కూతుళ్ల మధ్య ఉన్న శాశ్వత బంధాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. ఓ తండ్రిగా ఈ అనుబంధం నాకు వ్యక్తిగతంగా ఎంతో విలువైనదన్నారు. కూతురు ఎంత వయసు వచ్చినా తన తండ్రికి ఎప్పటికీ చిన్నపాపే అన్నారు. భావాన్ని స్పష్టంగా చెప్పే సామర్థ్యం ఈ పాటలో ఉంది కాబట్టే దాన్ని జాగ్రత్తగా ఎన్నుకున్నామన్నారు. ఈ ప్రయాణాన్ని అందంగా చూపించే విధంగా ఈ ప్రచారాన్ని రూపొందించాలనుకున్నామని తెలిపారు. దేశ నలుమూలల చేరేలా ఈ పాటను ఆరు భాషల్లో రూపొందించామన్నారు. మృదువైన, సహజ సంరక్షణ విలువలతో ముందుండే పేరెంటింగ్ భాగస్వామిగా హిమాలయ బేబీకేర్‌తో భాగస్వామ్యం చేసుకున్నందుకు గర్వంగా ఉందన్నారు.ఈ ప్రచారాన్ని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో #GentleAsDad అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ప్రారంభించనున్నారు. ప్రేక్షకులు తమ తండ్రులతో ఉన్న జ్ఞాపకాలను, మధుర క్షణాలను పంచుకోవడం కోసం ప్రోత్సహించనున్నారు.
Link to the DVC: https://www.youtube.com/watch?v=Cp89KdpZGSY

Leave A Reply

Your email address will not be published.

Breaking