స్థానిక ఎన్నికల్లో కష్టపడ్డ వారికే గుర్తింపు
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అబ్జర్వర్లు
చేర్యాల, అక్షిత ప్రతినిధి: చేర్యాల పట్టణంలోని వాసవి గార్డెన్ లో సోమవారం చేర్యాల పట్టణ మరియు మండల, మద్దూరు కొమురవెల్లి దులిమిట్ట మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశానికి సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్లు పవన్ మల్లాడి, మేనేని రోహిత్ రావు, తో పాటు జనగామ డిసిసి అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట డిసిసి అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి లు ముఖ్యఅతిథిగా హాజరైనారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్య నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తలకు తగిన పదవులు దక్కుతాయని, అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ స్థాయి నుండి జిల్లా సాయి వరకు ప్రతి కార్యకర్త కష్టపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి విజయ డంక మోగించాలి అని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొమ్మూరు ప్రశాంత్ రెడ్డి, మాజీ జడ్పిటిసిలు గిరి కొండల్ రెడ్డి, కొమ్ము నరసింగ రావు దాసరి కళావతి, పూర్మా ఆగం రెడ్డి, మంజ మల్లేష్, మండల శాఖ అధ్యక్షులు కొమ్ము రవి, మహాదేవుని శ్రీనివాస్, మ్యాక మల్లేశం,కోలా సాయిలు, ఏఎంసి చైర్మన్ నల్ల నాగుల శ్వేత వెంకన్న, పిఎసిఎస్ చైర్మన్ మెరుగు కృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు రాకేష్ కృష్ణ, చెట్కూరి కమలాకర్, అందె నాని, కర్క సంతోష్ రెడ్డి, బూమని బాలరాజు, బియ్య మహేష్, ధరవాత్ సుమన్, మరియు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.