తరగతి గదుల్లోనే
భవితకు పునాది
బ్రిలియంట్ వరల్డ్ పాఠశాల ప్రారంభం
ఎంఇఓ బాలు నాయక్
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనిలో ప్రముఖ విద్యావేత్త బ్రిలియంట్ పాఠశాలల చైర్మన్ జగన్ సింగుపురం, వైస్ ఛైర్పర్సన్ స్వాతి జగన్ సింగుపురం సారధ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రిలియంట్ వరల్డ్ పాఠశాలను గురువారం మండల విద్యాధికారి బాలు నాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ పుట్టల శ్రీనివాస్ తో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ బాలు నాయక్ మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ తరగతి గదుల్లోనే పురుడు పోసుకుంటుందని అన్నారు. ప్రభుత్వ నిభంధనల మేరకు ఫీజులు నిర్ణయించాలని, అధిక ఫీజులు వసూలు చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకౌంట్స్ అధికారి ప్రభాకర్ రావు, టీచర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.