నూతన సంవత్సర క్యాలెండర్ ను అవిష్కరించిన అదనపు కలెక్టర్

నూతన సంవత్సర క్యాలెండర్ ను అవిష్కరించిన అదనపు కలెక్టర్

మహబూబ్ నగర్, అక్షిత ప్రతినిధి : నూతన సంవత్సర క్యాలెండర్ ను మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అవిష్కరించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో జిల్లా బ్యూరో రిపోర్టర్ రాంమోహన్, మహబూబ్ నగర్ రిపోర్టర్ సుదర్శన్ లతో కలిసి ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పత్రికలు నిష్పక్షపాతంగా పనిచేసినపుడే సమాజానికి మేలు జరుగుతుందని అని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటున్న మీడియా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో మరింత కీలకపాత్ర పోషించాలని సూచించారు. ముఖ్యంగా వాస్తవాలను ప్రజలకు అందేలా చూడాలని పేర్కొన్నారు. నేడు సోషల్ మీడియా వల్ల తప్పుడు ప్రచారాలు చాలా త్వరగా వైరల్ అవుతున్నాయని కావున ఇలాంటి వాటిని మీడియా ఆరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అక్షిత దినపత్రిక కూడా ప్రజల పక్షాన నిలబడి మరింత ప్రజాధారణ పొందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్ ను అక్షిత మీడియా ప్రతినిధులు శాలువాతో సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking