అత్యవసర సేవల్లో అంకితభావం.. 108 పైలెట్‌కు ప్రశంస

అత్యవసర సేవల్లో అంకితభావం.. 108 పైలెట్‌కు ప్రశంస

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రశంస పత్రం…

లోకేశ్వరం, ఆగస్టు 15 అక్షిత న్యూస్‌ :

నిర్మల్ జిల్లా లోకేశ్వరం గ్రామానికి చెందిన 108 అంబులెన్స్‌ పైలెట్‌ మహేందర్‌ విధి నిర్వహణలో చూపుతున్న అంకితభావానికి ప్రశంస లభించింది. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో 108 అంబులెన్స్‌ పైలెట్‌గా విధులు నిర్వహిస్తున్న మహేందర్‌.. అత్యవసర సమయాల్లో సమయస్ఫూర్తితో స్పందిస్తూ క్షతగాత్రులు, అనారోగ్య బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలిస్తున్నారు.స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా మహేందర్‌,ను అభినందించి ప్రశంస పత్రం అందజేశారు.ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితుల్లో బాధితులకు సత్వర వైద్యసేవలు అందేలా అంబులెన్స్‌ను సురక్షితంగా నడుపుతూ ఆయన అందిస్తున్న సేవలను అధికారులు గుర్తించారు.విధి పట్ల నిబద్ధతతో బాధ్యతాయుతంగా పనిచేస్తున్న మహేందర్‌ను ప్రశంస పత్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్మల్‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, 108 జిల్లా మేనేజర్‌ లింగాచారి,అధికారులు, సహచర సిబ్బంది మహేందర్‌,ను అభినందించారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking