విద్యార్థులు రేపటి దేశ భవిష్యత్తు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు
వరంగల్, అక్షిత బ్యూరో:
నేటి బాలలే రేపటి భారత పౌరులని దేశ భవిష్యత్తు అని వారి శారీరక మానసిక ఎరువుల వారి విద్యా ప్రమాణాల ఎదుగుదలతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు అన్నారు.

స్ఫూర్తి కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్తో కలిసి బుధవారం జిల్లా పరిషత్ హై స్కూల్, సంగెం లో స్ఫూర్తి కార్యక్రమంలో ఇరువురు అధికారులు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు దేశానికి భావి పౌరులు కాబట్టి వారికి తెలువవలసిన కొన్ని మెళుకువలు అందులో ప్రధానంగా శారీరక, మానసిక ఆరోగ్యం స్థితి, శాస్త్రీయ దృక్పథం, ఆర్థిక సమస్యలపై అవగాహన ఆరోగ్యము పౌష్టికాహారము అలవర్చుకున్నట్లయితే మంచి పౌరులుగా తయారవుతారని తెలిపినారు.విద్యార్థులు స్వీయ అవగాహన, నైపుణ్యాలు, తోటి వారిపై సానుభూతి, సమస్యల పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రవర్తించాలని తెలిపినారు. భావవ్యక్తీకరణ సరళంగా, సృజనాత్మకమైన ఆలోచనలు, తర్కబద్ధమైన ఆలోచనలు ఉండాలని తెలిపినారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ నవీన్, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ భరత్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి అనిల్ కుమార్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, సిసి నాగరాజు ,రంజిత్ విద్యార్థులు పాల్గొన్నారు.