అక్షిత దినపత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

అక్షిత దినపత్రిక 2026 క్యాలెండర్ ఆవిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా/ అక్షిత న్యూస్ :

అక్షిత దినపత్రిక నూతన సంవత్సరం క్యాలెండర్ 2026 ను జిల్లా కేంద్రంలోని భువనగిరి లోని గల సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని పౌరసంబంధాల శాఖ అధికారి కార్యాలయంలో డీపీఆర్ఓ అరుంధతీ, అదే విధంగా జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అక్షాంశ్ యాదవ్, భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి లు బుధవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డిపిఆర్ఓ అరుంధతి మాట్లాడుతూ, పత్రికలు ప్రజల పక్షాన మాత్రమే ఉండాలని, నిస్వార్ధంగా, నిబద్దతో వార్తలు రాయాలని, నిజాన్ని నిర్భయంగా వార్తలు రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవాలని సూచించారు. అలాగే అక్షిత దినపత్రిక ప్రజల మన్ననలు పొందాలని, ప్రజా సమస్యలను వెలికి తీసి అధికారులకు చేరవేయడంలో ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో , రిపోర్టర్ లు సురేష్ శ్రీనివాస్ నాగరాజు వెంకటేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking