ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ
ఆసిఫాబాద్, అక్షిత ప్రతినిధి :
రాష్ట్ర ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ జిల్లా ఎస్పీ నికిత పంత్ కు ఫిర్యాదు చేశారు. బుధవారం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన కోవ లక్ష్మీ ఖమ్మం బహిరంగ సభలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు బి ఆర్ ఎస్ శ్రేణులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరకర, రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు అందచేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగేలా, ద్వేషాలను ప్రోత్సహిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, బి ఆర్ ఎస్ నాయకురాలు మర్సులోల సరస్వతి, పార్టీ పట్టణ అధ్యక్షుడు అహ్మద్, సర్పంచులు బురద పోచయ్య, చునర్కర్ సతీష్, ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, నాయకులు చిలువేరు వెంకన్న, గంధం శ్రీనివాస్, నిసార్, దూడల అశోక్, రవి, సాయి తదితరులు పాల్గొన్నారు.