ఆడపిల్లల భవితకు సుకన్య సమృద్ధి

  • ఆడపిల్లల భవితకు సుకన్య సమృద్ధి
  • ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సామాజిక భద్రత పథకాలను వినియోగించుకోండి

నారాయణపేట, అక్షిత ప్రతినిధి: దామరగిద్ద మండలంలోని సజనాపూర్ గ్రామంలోనీ హనుమాన్ టెంపుల్ దగ్గర విడ్స్ సంస్థ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో విలేజ్ లెవెల్ ఫైనాన్షియల్ లిటరసీ స్పెషల్ క్యాంప్ నిర్వహించారు. గ్రామస్థులను ఉద్దేశించి భారతీయ స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ రమణ, విడ్స్ సిఎఫ్ ఎల్ కౌన్సిలర్ హనుమంతు మాట్లాడుతూ.. బ్యాంకులలోని ఖాతాలు,ఈ కేవైసీ నామిని క్లైమ్,సామాజిక భద్రతా పథకాలైన ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన,ప్రధానమంత్రి సురక్ష భీమ యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి యోజన ఇన్సూరెన్స్ లు అర్హులైన వారు నమోదు చేసుకోవాలని తెలిపారు.సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దామరగిద్ద ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్ రమణ,పంచాయతీ కార్యదర్శి సుజాత,బ్యాంకు సిబ్బంది అనిల్,మాజీ సర్పంచ్ కనకప్ప,మాజీ ఉపసర్పంచ్ షేర్ ఖాన్,గ్రామ పెద్దలు,మహిళలు అంగన్వాడీ టీచర్లు,పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Leave A Reply

Your email address will not be published.

Breaking