మానసిక వేధింపులకు గురి చేస్తున్న ఎంపీడీఓ చర్యలు తీసుకోవాలని కలెక్టరు ఫిర్యాదు
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
ప్రతి పనికి డబ్బులు డిమాండ్ చేస్తూ మమ్మల్ని మానసిక వేధింపులకు గురి చేస్తున్న శాలిగౌరారం ఎంపీడీవో పై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతూ శాలిగౌరారం మండల పంచాయతీ కార్యదర్శులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కార్యదర్శులను ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ ప్రతి పనికీ డబ్బులు డిమాండ్ చేస్తూ ఇవ్వని వారిని మెమోలు జారీ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే జీతం ఆపుతానని సస్పెండ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు .గతంలో మమ్మల్ని బెదిరించి కార్యాలయానికి కూలర్ ఇప్పించుకుందన్నారు. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల ఖర్చుకు భోజన సదుపాయాల ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం అన్ని గ్రామాల కార్యదర్శులకు కొంత గ్రాంటురిలీజ్ చేసిందని దానిలో కొంత భాగమే పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చి మిగిలిన అమౌంట్ ను తనకు ఇవ్వాలని ప్రతి మీటింగ్ లో బెదిరిస్తున్నట్లు ఫిర్యాదు. చేశారు. లేని పక్షంలో ఇంక్రిమెంట్ చేయనని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలో డిప్యూటేషన్ పై విధులు నిర్వర్తిస్తున్న కార్యదర్శులకు డ్యూటీ సర్టిఫికెట్ ఇవ్వాలని అడిగితే డీజిల్ కు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుందన్నారు. గ్రామాలలో ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యదర్శులు పెట్టిన ఖర్చులను తిరిగి చెల్లించొద్దు అంటూ ఎంపీడీవో ఆయా గ్రామాల సర్పంచులకు, ఉపసర్పంచులకు చెబుతూ మమ్ముల్ని భయాందోళనకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కలెక్టర్ ఉత్తర్వులు లేకున్నా తానే కొన్ని గ్రామాలలో స్పెషల్ అధికారిగా నకిలీ ఉత్తర్వులలో చలామణి అయిందని కలెక్టర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మమ్ములను మానసికంగా వేధిస్తున్న ఎంపీడీవో పై తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు.