దుబ్బాకలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలంలోని దుబ్బాక గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్‌ను బాధితులకు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల నరసింహ ఆధ్వర్యంలో దవునోరి రాములు, కంబాలపల్లి శంకరయ్యలు ఈ సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నదని తెలిపారు.కార్యక్రమంలో మండల నాయకుడు గుండాల సతీష్, గ్రామ ఉప సర్పంచ్ గుండాల రమేష్, మాజీ సర్పంచ్ గట్టు యాదయ్య, వార్డు సభ్యుడు భైరోజు పురుషోత్తమాచారి, శెట్టి శేఖర్, తలకలపల్లి ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు..