కొంపల్లి సర్కిల్ లో ఏదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

కొంపల్లి సర్కిల్ లో ఏదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

టౌన్ ప్లానింగ్ విభాగం ఉన్నట్టా లేనట్లా.?

పరదాల చాటున అక్రమ నిర్మాణాలు.

నోటీసులతో కాలయాపన ముడుపులతో సరిపెడుతున్నట్లేనా..?

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న.టౌన్ ప్లానింగ్ అధికారులు..

టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు పై విమర్శలు వినిపిస్తున్నాయి..

మేడ్చల్, అక్షిత బ్యూరో:

కొంపల్లి సర్కిల్ లో ఏదేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు,అక్రమ నిర్మాణాల పై కన్నెత్తి చూడడంలేదు,కాసులకు కక్కుర్తి పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణదారులకు పరోక్ష సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి,కొంపల్లి సర్కిల్ లో ఉన్నతాధికారుల సమన్వయలోపం ఇక్కడ అక్రమ నిర్మాణదారులకు కలిసొచ్చే అంశంగా మారింది,జి ప్లస్ 3 మున్సిపల్ అనుమతులు పొందిన నిర్మాణదారులు పరదాల చాటున జి ప్లస్ 5 బహుళ అంతస్తులు నిర్మిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు,కొంపల్లి సర్కిల్ లోని సుభాష్ నగర్ డివిజన్,సాయి బాబానగర్ డివిజన్ తోపాటు జయభేరి కాలనీ దూలపల్లి డివిజన్,అపర్ణా ఫామ్ మెడోస్ ప్రాంతాల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు సాగుతున్న అధికారులు సంబంధం లేనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది.

పరదాల చాటున అక్రమ నిర్మాణాలు..

అధికారుల సమన్వయ లోకం..నిర్మాణదారులకు కలిసొచ్చే అంశం

కొంపల్లి సర్కిల్ లో అధికారుల సమన్వయ లోపం కొట్టిచ్చినట్లు కనబడుతుంది,టౌన్ ప్లానింగ్ ఏసీపీ సమాధానాలు దాటవేస్తుండడం,డిప్యూటీ కమీషనర్ ను వివరణ కోరితే సంబంధం లేనట్లుగా వ్యవహరించడం అధికారుల సమన్వయలోపానికి అద్ధంపడుతుంది,టౌన్ ప్లానింగ్ ఏసీపీ,డిప్యూటీ కమీషనర్ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట పడడం లేదంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏసీపీ దాడులు నిర్వహిస్తున్న ఆగని అక్రమ నిర్మాణాలు

మున్సిపల్ ఆదాయానికి వెన్నముఖలాంటి టౌన్ ప్లానింగ్ లో అవినీతి కంపుకొడుతుంది,అవినీతి అధికారులే లక్ష్యంగా వరుసగా ఎసిబి దాడులు జరుతున్నా వారి తీరు మారడంలేదు,అక్రమ నిర్మాణదారుల నుండి అందినకాడికి దండుకుంటూ సర్కిల్ ఆదాయానికి గండికొడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking