రామన్నపేట లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన. సీఐ, ఎన్ వెంకటేశ్వర్లు
విద్యార్థులతో మానవహారం..
“డాడ్ ప్లీజ్… హెల్మెట్ కొనిపెట్టండి” నినాదం
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులతో సుభాష్ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండడం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందేశాలను తల్లిదండ్రులకు చేరవేయాలని సూచించారు. “డాడ్ ప్లీజ్… మాకు హెల్మెట్ కొనిపెట్టండి” అనే అంశంపై విద్యార్థులతో వ్యాసరచన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో , ఎస్ ఐ డి. నాగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.