ఖమ్మంలో రిటైర్డ్ ఉద్యోగుల ప్రదర్శన
ఖమ్మం /అక్షిత బ్యూరో :
రిటైర్డ్ ఉద్యోగుల న్యాయమైన దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వందలాదిమంది పెన్షనర్లు ఖమ్మంలో రోడ్ ఎక్కారు. పెన్షనర్ల నుండి డబ్బులు వసూలు చేసి కూడా హెల్త్ కార్డులను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తూ పెన్షనర్లను మానసికంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వ విధానాల పట్ల వారు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. పే రివిజన్ కమిటీ రిపోర్టును వెంటనే ప్రకటించాలని పెండింగ్ లో ఉన్న ఆరు డిఎలను వెంటనే విడుదల చేయాలని పెన్షనర్ల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేస్తూ హెల్త్ కార్డుల అమలులో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నిరసించారు. పెన్షనర్ల జిల్లా కార్యవర్గ సభ.ప్రదర్శన అనంతరం ఖమ్మం రోటరీ నగర్ లోని రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఎం సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్ల ప్రయోజనాల సక్రమ విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతుందని కొందరు అధికారులు సరైన సమాచారాన్ని సక్రమమైన పద్ధతిలో ముఖ్యమంత్రి వివరించకపోవడం వలన జాప్యం జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని హెల్త్ కార్డుల మంజూరీలో అనేక తప్పులు జరిగాయని వాటిని సవరించడం కోసం ముఖ్యమంత్రి తో మాట్లాడటం జరిగిందని అన్నారు. సమగ్ర ప్రయోజనాలు కలిగించే హెల్త్ కార్డులను వారం రోజులలోగా విడుదల అయ్యే విధంగా కృషి చేస్తానని అదే రకంగా ఉద్యోగ పెన్షనర్ల పే రివిజన్ కమిషన్ రిపోర్టును ప్రకటించి అమలు కోసం తన వంతు కృషి చేస్తానని పెండింగ్లో ఉన్న డిఏ లు విడుదల కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి తోనూ అధికారులతోనూ మాట్లాడడం జరిగిందని తెలిపారు. తాను కూడా పెన్షనర్ల సంఘ సభ్యులు అని పెన్షనర్ల ఇబ్బందులు చాలా అన్యాయమైన మని వాటి పరిష్కారంలో ముందుండి కొట్లాడుతానని రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గల రిటైర్డ్ ఉద్యోగుల సంఘం తన వెంటనే ఉండదని వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఆందోళనకు కూడా సిద్ధమని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి హెల్త్ కార్డు ట్రస్ట్ బోర్డులో మన సంఘ నికి ప్రాతినిధ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 2024 మార్చి తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారి ప్రయోజనాలన్నీ విడుదల చేయడంలో తన వంతు కృషి చేశానని ఇంకనూ అనేకమంది పెండింగ్లో ఉన్నాయని వాటికోసం జేఏసీ ద్వారా ఇప్పటికే ప్రాతినిధ్యం చేసి ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి వివరించడం జరిగిందని ఒక నెల రోజుల్లో గా సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రంలోని 33 జిల్లాలలోని 1,50,000 మంది మన సంఘ సభ్యులు ఆందోళనకు దిగుతామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో సంఘ ఐక్యత కోసం కృషి చేస్తామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరు వేణు మాట్లాడుతూ జరిగిన కార్యవర్గ సమావేశంలో జిల్లాలోని సత్తుపల్లి పెనుబల్లి కల్లూరు తల్లాడ ఏన్కూరు వైరా ఎర్రిపాలెం మధిర నేలకొండపల్లి కూసుమంచి తో పాటు ఖమ్మం నగరంలోని నాలుగు శాఖల ప్రధాన బాధ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారని గత ఆరు నెలల కాలంలో సంఘం నిర్వహించిన కార్యకలాపాల నివేదికను ప్రవేశపెట్టారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం వెంటనే పాటించాలని అదే రకంగా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గల వెల్నెస్ సెంటర్ ను ఆధునికరించాలని పూర్తి కాలం డాక్టర్లు ఉండే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబాకుల వెంకటేశ్వర్లు అసోసియేట్ అధ్యక్షులు పి సీతారామయ్య. కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వెస్లీ మరియు మహబూబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మైస నాగయ్య శ్యామ్ కుమార్ ఖమ్మం జిల్లా నాయకులు ఎస్ పూర్ణచందర్రావు ఆర్ వెంకటనారాయణ చెంచు రెడ్డి దుర్గాదేవి జనార్ధన్ కాజా మొయినుద్దీన్ జానయ్య కృష్ణారెడ్డి రాష్ట్ర నాయకులు వజ్రా శ్రీనివాసరావు చల్ది బాబురావు ఉపేందర్ రావ్ నగర నాయకులు రమేష్ సత్యనారాయణ జి వెంకటేశ్వర్లు రమణ యాదవ్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
